అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రధానం

అంబేద్కర్  ఇంటర్నేషనల్ అవార్డు ప్రధానం

డా, సురభి శ్రీధర్ కు డా, భీమ్ రావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రధానం. 

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి. స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో  , సోమవారం సాయంత్రం హైదరాబాద్ ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సిటీ కల్చలర్ సెంటర్ ఆటోరి యంలో భారతరత్న భీమ్ రావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు ను అందించడం జరిగింది. ఈ అవార్డును, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పంచాయతీరాజ్ శాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాదయ్య గౌడ్, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ఫౌండర్ అండ్ చైర్మన్  లయన్ డాక్టర్ ఆకుల రమేష్, డాక్టర్ జి నరసింహారావు,డాక్టర్ ఆర్ఎస్ కుమార్, డాక్టర్ వల్లం భారత్, చేతుల మీదుగా భారతరత్న డా, భీమ్ రావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ కు అందించడం జరిగింది. అనంతరం డా, సురభి శ్రీధర్ మాట్లాడారు. 75వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని. స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ,  వెలుగు సామాజిక స్వచ్ఛంద చేస్తున్న సేవలను గుర్తించి డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు ను అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడానికి తన సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవ కార్యక్రమాలకు చేయూతనిస్తున్న ప్రతి ఒక్క సహకారంతోనే ఈ అవార్డు రావడం జరిగిందని సురభి శ్రీధర్ తెలిపారు. ఈ అవార్డు అందించిన స్ఫూర్తి సంస్థకు, తనకు సంస్థకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని. సురభి శ్రీధర్ తెలిపారు. శ్రీధర్ కు అవార్డు రావడం పట్ల పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతోపాట పలువురు శుభాకాంక్షలు తెలిపారు.