సిందూరమ్మకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు :
సిందూరమ్మకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు :
సత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మే 06:(జనచైతన్యన్యూస్):మండలంకేంద్రంలోని టి. కుంట్లపల్లి, వెంకటాపురం పంచాయితీలోని బసప్పగారిపల్లి, ఈరానపల్లి,టి.కుంట్లపల్లి, నల్లగుట్లపల్లి,నారప్పగారిపల్లి గ్రామాల్లో ఎన్డిఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సిందూరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సిందూరమ్మకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు,గజమాలతో స్వాగతం పలికారు,పల్లె సిందూరరెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రం పది వెనుకబడితే, వైసీపీ పార్టీ పాలన కారణంగా మరో పది సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడింది అన్నారు,అభివృద్ధి అనే మాయమాటలతో మోసం చేసిన వైసీపీ పార్టీని అంతం చేయాలని పిలుపునిచ్చారు, చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అన్నారు,సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారితో గెలిపించాలని కోరారు, ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, వెంకటాపురం సర్పంచ్ శంకర్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసులు,సున్నపల్లి ఉపసర్పంచ్ నంది ఉతప్ప, మద్ధకవారిపల్లి కిష్టప్ప,నిజాంవలి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కే.ఆంజనేయులు,మైనార్టీ నాయకులు షబ్బీర్, సౌదీ నాగరాజు, మహిళలు మస్తానమ్మ, జ్యోతి, వైష్ణవి, అఖిలా, బీజేపీ నాయకులు రంగారెడ్డి, అశ్వర్థప్ప,నాగప్ప టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు