జర్నలిస్టులకు సంక్షేమంతో పాటు రక్షణ కల్పించాలి,టిడిపి రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కు వినతి పత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్ ఏ ఆర్ ఏ) నాయకులు

జర్నలిస్టులకు సంక్షేమంతో పాటు రక్షణ కల్పించాలి,టిడిపి రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కు వినతి పత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్ ఏ ఆర్ ఏ) నాయకులు

జర్నలిస్టులకు సంక్షేమంతో పాటు రక్షణ కల్పించాలి,టిడిపి రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కు వినతి పత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్ ఏ ఆర్ ఏ) నాయకులు

జనచైతన్య న్యూస్-అమరావతి

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక జర్నలిస్టు అసోసియేషన్,అతి తక్కువ కాలంలో భారత దేశంలోనే ఎక్కువ సభ్యులను కలిగిన అసోసియేషన్ గా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందింది.జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో రకాల పోరాటాలు చేసినా కూడా జర్నలిస్టుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిపోయింది.జర్నలిస్టుల సంక్షేమానికి జర్నలిస్టుల కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తేనే ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు,ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు అహర్నిశలు శ్రమిస్తూనే ఉంది.ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్ ఏ ఆర్ ఏ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ని కలసి జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటుకు మద్దతు కోసం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై మీరు చేసే అవిశ్రాంత పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరుపున నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎన్ ఏ ఆర్ ఏ నాయకులకు తెలియచేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టులకు సంక్షేమంతో పాటు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది.ఆ దేశంలో కానీ,సమాజంలో కానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల కు సంక్షేమం రక్షణ కల్పించి జర్నలిస్టులకు పూర్తి న్యాయం చేస్తుందన్నారు.ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకుంటుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు.జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, జర్నలిస్ట్ కార్పొరేషన్ సాధించడానికి తను పూర్తి మద్దతు ఇస్తానని తెలియచేసిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కు ఎన్ ఎ ఆర్ ఎ నాయకులు కృతజ్ఞతలు తెలియచేసారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ని కలసిన వారిలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్ర బాబు, నేషనల్ జనరల్ సెక్రటరీ,మద్దినేని మానస,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు నల్లూరి ప్రదీప్ కుమార్,సలవాది రాజేష్,శిరివెళ్ల,నాగరాజు,అరుణ్ కుమార్,రంజిత్ కుమార్,జయరాజు ఉన్నారు.