నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్,వారి సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాకు విశేష స్పందన
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్,వారి సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాకు విశేష స్పందన
జనచైతన్య న్యూస్- పశ్చిమ
విజయవాడ జిల్లా పశ్చిమ నియోజకవర్గం భవానిపురం సుజనా ఫౌండేషన్,నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్,వారి సంయుక్త ఆధ్వర్యంలో భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. సుజనా ఫౌండేషన్, సీఈవో పివి రావు, విజ్ఞప్తి మేరకు టెక్ మహీంద్రా, రిలయన్స్, అపోలో ఫార్మసీ, ముత్తూట్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, వరుణ్ మోటార్స్ లాంటి అనేక కంపెనీలతో పాటు మొత్తం 30 కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 3000 మందికి పైగా నిరుద్యోగ యువతి, యువకులు, మేళాలో పాల్గొన్నారు. యువతకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నిరుద్యోగ యువత కోసం సుజనా ఫౌండేషన్ కోఆర్డినేటర్ వీరమాచినేని కిరణ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.