దుర్మార్గ వైసిపి పాలనకు అంతం పలకండి*
*దుర్మార్గ వైసిపి పాలనకు అంతం పలకండి*
*పుట్టపర్తి ప్రశాంతంగా ఉండాలంటే టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర ను ఆశీర్వదించండి* .
*మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి*
*ఓడి చెరువు:21*
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని ,ఈ ఎన్నికల్లో వైసీపీ పాలనకు అంతం పలకాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి మద్దతుగా ఓడి చెరువు మండలం మిట్ట పల్లి పంచాయతీలోనీ గ్రామాల్లో మాజీ మంత్రి పల్లె ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రికి మిట్టపల్లి పంచాయతీ ప్రజలు నీరాజనాల పలికి పోలో వర్షం కురిపిస్తూ బాణాసంచా పేల్చి అపూర్వ స్వాగతం పలికారు. టిడిపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం తో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు టిడిపి తీసుకొచ్చిన మినీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు పేదలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు . చదువుకునే విద్యార్థి తల్లి ఖాతాలోకి ఏటా రూ.15వేలు చొప్పున అందజేస్తామని చెప్పారు. 50 సంవత్సరాలు నిండిన బీసీ వర్గాలకు ప్రతినెల 4000 రూపాయలు పెన్షన్ మంజూరు చేస్తామన్నారు నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతినెల 3000 చొప్పున ఏటా 36,000 మృతి మంజూరు చేస్తామన్నారు . ప్రతి పేదవాడి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందజేస్తామన్నారు 18 సంవత్సరాలు కలిగి ఉండి 59 సంవత్సరాలు నిండిన మహిళలకు ఏటా 18 వేలు ఆడబిడ్డ నిధి అందజేస్తామన్నారు. అంతేకాకుండా అన్నదాతను ఆదుకునేందుకు అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఏటా రూ. 20,000 మంజూరు చేసి ఆదుకుంటామన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడ లేవన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదేళ్లలో ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని ,ఇవన్నీ పోవాలంటే టిడిపి సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి హిందూపురం పార్లమెంటు టిడిపి ఉమ్మడి అభ్యర్థి పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు తోడ్పాటు అందించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఓడి చెరువు మండల టిడిపి కన్వీనర్ జయచంద్ర ,మాజీ జెడ్పిటిసి పిట్ట ఓబుల్ రెడ్డి తో పాటు టిడిపి ,జనసేన ,బిజెపి నాయకులు ,కార్యకర్తలు, మహిళలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.