చిరంజీవి రామ్ చరణ్ యువ ఫౌండేషన్ తరపునసూపరిడెంటెంట్ Dr.హుస్సేన్ వినతి పత్రం
*కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు కిడ్నీ సంబంధిత రోగులకు అందించే డయాలసిస్ గదులను , పరికరాలను పెంచి వారి సమస్యను పరిష్కరించండి - అఖిల భారత చిరంజీవి యువత కదిరి నియోజకవర్గం అధ్యక్షులు లక్ష్మణ కుటాల*
కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు డయాలసిస్ చేసుకోవడానికి పరికరాలు లేకపోవడం వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా పేద ప్రజలు.ఎందుకంటే కదిరి నియోజకవర్గంలో 10 మండలాలకు కలిపి కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మాత్రమే సర్వజనాసుపత్రి.
ఈ హాస్పిటల్ కి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు అందులో డయాలసిస్ చేసుకొనే వారు కూడా అధిక సంఖ్యలో ఉండటం వారికి ఒక్కొక్క సందర్భంలో ఒక నెల రోజుల పైబడి అవ్వడం వల్ల కిడ్నీ రోగులు అనంతపురం , తిరుపతి వంటి నగరాలకు వెళుతున్నారు దీని కారణంగా పెద్ద మొత్తంలో ఖర్చు రావడం వల్ల తీవ్రమైన అవస్థలు పడుతున్నారు.మీరు సహృదయంతో డయాలసిస్ పరికరాలను,వైద్యులను,గదులను పెంచి కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి వస్తున్న కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న వారి సమస్యను సాధ్యం అయినంత తొందరగా పరిష్కరించాలని *అఖిల భారత చిరంజీవి యువత,రామ్ చరణ్ యువ ఫౌండేషన్* తరపున *కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరిడెంటెంట్ Dr.హుస్సేన్* గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాజేంద్ర,చంద్ర శేఖర్ తనకంటి,సోము శేఖర్,కృష్ణ కాంత్ , చక్రి ,మధు,అరవింద్ ,కార్తిక్ తదితర టీమ్ సభ్యులు