ఏపీ చేనేత కార్మిక సంఘం చింతా పురుషోత్తం వినతిపత్రం ఇవ్వడం జరిగినది
ఏపీ చేనేత కార్మిక సంఘం చింతా పురుషోత్తం వినతిపత్రం ఇవ్వడం జరిగినది
జనచైతన్య న్యూస్-పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో రామకోటి కాలనీలో చౌడేశ్వరి గుడి ఆవరణలో అనంతపురం జిల్లా జౌళి శాఖ అధికారులు ఏ డి ఓ అప్పాజీ, అధికారులు శ్రీనివాసులు చేనేత కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల రాయితీలు గురించి నేరుగా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ చేనేత కార్మిక సంఘం చింతా పురుషోత్తం వినతిపత్రం ఇవ్వడం జరిగినది. మా ప్రధానమైన సమస్య లు చేనేత కార్మికులకు నేతన్ననేస్తం అమలు చేయాలని అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు, గత వైసిపి ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉండాలని ప్రతి సంవత్సరం చేనేత కార్మికులకు 24 వేల రూపాయలు నేరుగా తమ అకౌంటులకు జమ చేయడం జరిగింది, అలాగే టిడిపి ప్రభుత్వం కూడా చేనేత కార్మికులను నేతను నేస్తం పథకం అమలు చేసి ఆగస్టు చేనేత దినోత్సవం రోజున 24 వేల రూపాయలు నేరుగా చేనేత కార్మికుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని చేనేత అధికారి ఏడి అప్పాజీ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు చింత వెంకటరమణ, జి ఓబులేసు, సి రమేష్, బి వెంకట రాముడు, డి రామాంజనేయులు, శ్రీనివాసులు, హరిప్రసాద్, వెంకటరాముడు, వేణుగోపాలు, కేశవ, నాగేశం తదితరులు పాల్గొన్నారు.