తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి - ధర్నా
తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ధర్నా
విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )
ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువజన విభాగం బి జే వై ఎం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ మిట్టా వంశీ కృష్ణ ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు పోలీసుల యత్నం. విజయవాడ జింఖానా మైదానంలో మోహరించిన పోలీసులు. ఆమరణ నిరాహార దీక్ష భగ్నం చేయడానికి బెటాలియన్ ను రంగంలోకి దింపిన వైసీపీ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే నినాదాలతో హోరెత్తుతున్న జింఖానా మైదానం. ప్రాంగణానికి చేరుకుంటున్న భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు.