చలో ఢిల్లీ మాదిగల మహా ధర్నా కార్యక్రమం కరపత్రాలు విడుదల చేయడం జరిగింది
చలో ఢిల్లీ మాదిగల మహా ధర్నా కార్యక్రమం కరపత్రాలు విడుదల చేయడం జరిగింది
జనచైతన్య న్యూస్- అనంతపురం
అనంతపురము జిల్లా అనంతపురం పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు తలపెట్టిన చలో ఢిల్లీ మాదిగల మహా ధర్నా కార్యక్రమ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు అంజన ప్రసాద్, ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చిరంజీవి, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి సుదర్శన్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు హనుమంతు, అనంతపురము మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అజయ్ బాబు, రాయలసీమ జిల్లాల అధ్యక్షులు మీనుగా రామాంజినేయులు, కళ్యాణదుర్గం తాలూకా ప్రెసిడెంట్ పాలవాయి, అనంతపురము జిల్లా యువనసేన అధ్యక్షులు రాళ్లపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.