ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ, నూతన నిర్మాణాలను విజయవంతం చెయ్యండి

ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ, నూతన నిర్మాణాలను విజయవంతం చెయ్యండి

ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ, నూతన నిర్మాణాలను విజయవంతం చెయ్యండి 

 జనచైతన్య న్యూస్- అనంతపురం

అనంతపురం జిల్లా పట్టణంలో ఉపాధ్యాయ భవనంలో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి అనుబంధ సంఘాల జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం సభా పరిచయం జిల్లా ఎంఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ పరిచయం చేయగా సభాధ్యక్షులుగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగ అధ్యక్షతన జరిగినది, ముఖ్య అతిథులుగా డాక్టర్ వైకే విశ్వనాధ్ మాదిగ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు బండారు కదిరప్ప మాదిగ పాల్గొన్నారు. ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కేబి మధు మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు తాడిపత్రి ఎం పెద్దిరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలు జగ్గుల స్వతంత్ర కుమారి మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు జానకి రాముడు, సీనియర్ గంగరాజు సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల నేత మాదిగ జాతి దేవుడు మాన్య మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ జాతి అభివృద్ధి కోసం మాదిగ జాతి అభ్యున్నతి కోసం మాదిగ జాతికి రావాల్సినటువంటి హక్కుల కోసం ఏదైతే పోరాటం చేసాము, మన చిరకాల ఆకాంక్ష ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరణ సాధించుకునే సమయం అతి దగ్గరలో ఉన్నాం, కాబట్టి మాన్య మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో తీర్పు వెలువడక ముందే ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోని ప్రతి నియోజకవర్గంలోనూ మాదిగలను చైతన్యపరిచి జెండా దిమ్మలు ఏర్పాటు చేసుకొని జెండా ఆవిష్కరణ నూతన ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీలను నిర్మాణాత్మకంగా తిరుగులేని శక్తిగా మాదిగ దండోరాన్ని నిర్మించాలి. భావితరాలకు భవిష్యత్తును అందించే విధంగా ఈ నిర్మాణం జరగాలని తెలియజేయడం జరిగింది, తదానంతరం ముఖ్య అతిథి రాష్ట్ర ఎంఎస్పీ అధ్యక్షుడు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ మాట్లాడడం జరిగింది, ఈ కార్యక్రమంలో పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ ఎంఎస్పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ఎం, ఎస్ పి జిల్లా అధ్యక్షులు గుంతకల్లు నరసింహులు, ఎంఎస్పి అధికార ప్రతినిధి నాగభూషణం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి వారణాసి శీను, ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటాపురం చంద్ర, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బార్నాసి శీను, జిల్లా ప్రధాన కార్యదర్శి మారెప్ప,  ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా నాయకురాలు గుత్తి సునీతమ్మ, శాంత కుమారి నిషా రహమద్, పామిడి కుమార్ గుంతకల్లు వెంకటేష్, బ్రహ్మసముద్రం నాగరాజు, కోడేరు రాజు, విడపనకల్లు స్వామి,  ఎల్లప్ప, ఉరవకొండ రమేష్ బాబు, రాయదుర్గం తిప్పే సామి, నందీసు, నార్పల పుల్లప్ప పాల్గొన్నారు.