మంచినీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మంచినీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- దేవినేని అవినాష్
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)
పులిచింతల ప్రాజెక్టు నుండి విజయవాడ నగరానికి సరఫరా అవుతున్న నీరు మలినమై వస్తుంది అని, హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద నిరీ ఫిల్టర్ అవ్వడం ఆలస్యం అవుతుంది . కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన అవినాష్ ప్రజలు మంచినీటి ని కాచి వడపోసుకొని త్రాగలని సూచించారు. రా మంచినీటి సరఫరా వలన నీటిలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంది అని కాబట్టి కాచి వడపోసుకొని త్రాగలని కొండప్రాతంలో నివసించే ప్రజలకు తెలిపారు. మున్సిపల్ కమిషనర్,నగర మేయర్ అధికారులతో మాట్లాడటం జరిగింది అని అతి త్వరలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.