రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి జన్మదిన శుభాకాంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి జన్మదిన శుభాకాంక్షలు
జన చైతన్య న్యూస్- కడప( సత్యసాయి జిల్లా)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి పుట్టినరోజు సందర్భంగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డా. కొప్పుల విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ద్రౌపది 1997 మొదట భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి రాయి రంగాపూర్ పంచాయతీ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. 1983 వరకు నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసి, ఆ తర్వాత ఉపాధ్యాయురాలుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2000లో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి బిజెపి అభ్యర్థిగాపోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నో పదవుల్లో ఆమె తన నిజాయితీని నిరూపించుకొని రాజకీయాల్లోనే కొనసాగాలని తెలిపారు.ద్రౌపది ముర్ము 2022లో జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మొట్టమొదటి గిరిజన మహిళ రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.