పంపిణీ చేయాలి అలాగే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

పంపిణీ చేయాలి అలాగే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలి అలాగే సేంద్రియ వ్యవసాయన్ని ప్రోత్సహించాలి :-

 ఓ.డి. చెరువు మే 24(జనచైతన్య న్యూస్):-రైతులకు పంపిణీ చేసే వేరుశనగ ఇతర ధాన్యాల నాణ్యతలో రాజీ పడకూడదని నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలని బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. విత్తనాలు నాణ్యమైనవి అయితేనే వచ్చే పంట బాగుంటుంది తద్వారా రైతాంగానికి ఉపయోగంగా ఉంటుందని ఆయన అధికారులను కోరారు, వేరుశనగ విత్తనాలు రైతులకు సరిపడా అందుబాటులో ఉంచాలని అంతర పంట కోసం రైతులు వేసుకొనే కంది,మినుములు,పెసలు,కొర్రలు, రాగి, ఉలవలు, అలసందలు వంటి ధాన్యాలు కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . అంతర పంటల ధాన్యాల సబ్సిడీ ధరలు కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. తృణధాన్యాలు కూడా 80 శాతం సబ్సిడీపై రైతులకు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,యువ రైతులు చదువుకున్నటువంటి రైతన్నలు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయాన్ని చేయాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభసాధటిగా ఉంటుందని ఆయన తెలిపారు రైతులు పెట్టుబడుల కోసం అధిక ధరలతో రసాయన ఎరువులు కొని నష్టపోతున్నారని తద్వారా పంట పొలాలు కూడా నిస్సారమైపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.