అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు:-
ఓ.డి.చెరువు మే(జనచైతన్య న్యూస్) ఉన్నతాధికారులఆదేశాల మేరకు మండలంలోని కుసుమవారిపల్లి, దిగువపల్లి, కొండకమర్ల, గ్రామాలలో నల్లమాడ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఓ.డీ.సీఎస్సై వంశీ కృష్ణ, అమడగూరు ఎస్సై మక్బూల్ భాష, నల్లమాడ ఎస్సై రమేష్ బాబు, ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ సిబ్బంది సర్కిల్ పోలీస్ సిబ్బంది తో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు,గ్రామాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు, గ్రామం లోని ప్రజలతో మాట్లాడుతూ 144 సెక్షన్ అమలులో ఉందని ఎక్కడ గుంపులుగా ఉండకూడదని,ఎవ్వరు కూడా ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని ఎలాంటి అసాంఘిక కార్యకలపాలకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని సమస్యాత్మక గ్రామాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు ఉంటుందని తెలిపారు,