ఆంధ్రాలో అమరావతి ఇసుక మాఫియా విజృంభణ

ఆంధ్రాలో అమరావతి ఇసుక మాఫియా  విజృంభణ

అమరావతి ఇసుక స్కాంలో నిండా మునిగేది కలెక్టర్లే

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

ఆంధ్రాలో ఇసుక దోపిడికి అడ్డగోలుగా సహకరించి తప్పుడు రిపోర్టులు కూడా ఇచ్చిన కలెక్టర్లు నిండా మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వారందరూ ఉద్యోగాలు పోగొట్టుకున్నా ఆశ్చర్యం లేదు. కేంద్ర కమిటీ. ఎన్జీటీకి ఇచ్చిన రిపోర్టు. అందులోని అంశాలు చూస్తేఎవరికైనాఅర్థమవుతుంది. ఘోరమైన దోపిడీ జరుగుతున్నా. కలెక్టర్లు తప్పుడు నివేదికలు ఇవ్వడమే కాదు.  ఏకంగా ఎన్జీటీ, సుప్రీంకోర్టు కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు. ఏపీలో ఇసుక తవ్వకాలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ప్రతీ నెలా వందల కోట్ల మేర ఇసుక మీద దోపిడీ చేస్తున్నారు. ఇదో వ్యవస్థీకృత దోపిడి. ప్రభుత్వానికి వచ్చేది తక్కువ. అంతా ఒకే కాంట్రాక్టర్ కు అప్పగించి … కొంత మొత్తం ఏపీ ప్రభుత్వానికి ఇస్తున్నట్లుగా నటించి.. మిగతా అంతా దోచుకెళ్తున్నారు. కళ్ల ముందే అంతా కనిపిస్తున్నా చూస్తూ ఉండిపోయారు. నాడు జేపీ పవర్ వెంచర్స్ అనే కంపెనీ.. నేడు వైఎస్ అనిల్ రెడ్డి అనే వ్యక్తి కి చెందిన బినామీ కంపెనీలు ఇసుకను దోచుకు తింటున్నాయి. కేంద్ర నివేదికలో అన్ని అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటిని సుప్రీంకోర్టు ముందు పెట్టనున్నారు.