విజయవాడలో కాపు జేఏసి సమావేశం గ్రాండ్ సక్సెస్

విజయవాడలో కాపు జేఏసి సమావేశం గ్రాండ్ సక్సెస్

విజయవాడ కాపు జేఏసీ సమావేశం గ్రాండ్ సక్సెస్ 

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

ఏకగ్రీవంగా తొమ్మిది తీర్మానాలు ఆమోదం

5000 మందికి పైగా హాజరైన కాపు ప్రతినిధులు

రాష్ట్రంలో నలు దిక్కుల నుండితెలంగాణ,తమిళనాడు,  కర్ణాటక నుండి తరలిన కాపులుకాపు కుటుంబ సభ్యులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడు దాకా

దామాషా పద్ధతిలో 25 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే

కాపు జాగృతి, కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన విజయవాడ రాష్ట్ర జనాభాలో 25 శాతం ఉన్న కాపులకు దామాషా ప్రకారం..అన్ని రాజకీయ పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో, వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడు దాకా సీట్లను కేటాయించాలని 

కాపు జాగృతి, కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు.

కాపు ప్రతినిధుల సమావేశం విజయవాడ లబ్బీపేట లోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ లొ 5000 మంది కాపు ప్రతినిధులతో శుక్రవారం ఉదయం 11 గంటలకు కాపు జాగృతి,  కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్ధన్ అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చందు జనార్ధన్ మాట్లాడుతూ కుటుంబాన్ని   వదిలి అహర్నిశలు సంఘం కోసం పనిచేస్తూ ఉన్న సంఘ నాయకులు గౌరవించుకుంటే.. రాజకీయ పార్టీలు మనల్ని గౌరవిస్తాయని ఉద్వేగంగా అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మెయిన్ స్క్రీమ్ జాబులు కాపుల్లో ఎవరికి ఇవ్వలేదని ఆవేదన చెందారు. కాపులను ఓటు బ్యాంకుగా గత ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని ఇకనుంచి ఆ పద్ధతి మారాలన్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఏ కాపుకి కష్టం వచ్చినా కాపు జాగృతి అండగా ఉంటుంది అని అలాగే ఇతర వర్గాలకు కూడా తోడుగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ,  తూర్పు, ఉత్తరం ఇలా రాష్ట్రంలో నలవైపు నుండి  వేలాదిగా పాల్గొన్న కాపు మిత్రులకు, నాయకులకు.. ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారుల బృందం  తమిళనాడులో చీఫ్ సెక్రటరీగా అనేక సంవత్సరాలు బాధ్యత నిర్వహించిన రామ్మోహన్రావు, ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ గా బీవీరావు,విశ్వబ్రాహ్మణ సంఘం నెలకొల్పి.. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఏడు ఎకరాలు కాపు జాగృతికి.. తెప్పించుకున్న.. GST మాజీ చీఫ్ కమిషనర్ రంగశెట్టి మంగబాబు, మాజీ హైకోర్టు జడ్జ్ భాను ప్రసాద్.. తో పాటు ఇక్కడ పని చేసి వెళ్ళిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు.తెలంగాణ,హైదరాబాద్,చెన్నై వంటిదొర ప్రాంతాల నుంచి వచ్చిన సోదరులు,  మహిళా మణులకు అభినందనలు తెలియజేశారు. 

ముందుగా వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పి రామ్ మోహన్ రావు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున తీర్మానాలను ప్రతిపాదించి.. చర్చించి..అందరిచే చే ఏకగ్రీవంగా ఆమోదింప చేశారు. తీర్మానాలు ఇవే

1)ఐక్యత,సమైక్యత,అభివృద్ధి,రాజాధికారం,  మనకోసం పనిచేస్తామని పేర్కొన్నారు.

2) పాప ఉద్యోగులపై అనునిత్యం అణిచివేతలు, వేధింపులు,ఛార్జ్ మెమొలు,సస్పెన్షన్ లుకొనసాగుతున్నాయి.

 తక్షణమే బేషరతుగా అన్ని రద్దు చేయాలి.  దీనిపైన కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

3) దామాషా ప్రకారం వాటి స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలి.  ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలి.

4) కాపు,  తెలగ, బలిజ,  ఒంటరిలకు బీసీ రిజర్వేషన్ కల్పించాలి.

5) కులాల వారీగా కుల గణన చేపట్టి రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గ వాస్తవ సంఖ్యను లెక్కించి దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయాలలో అవకాశాలు కల్పించాలి.

6) కాపు కార్పొరేషన్ నిధులు సంవత్సరానికి 2000 కోట్లు చొప్పున ఐదేళ్లకు 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. కాపుల సంక్షేమానికి మాత్రమే ఆ నిధులను ఖర్చు పెట్టాలి.

7) నూతన జిల్లాలకు శ్రీకృష్ణదేవరాయల, వంగవీటి మోహనరంగా,పెరియార్ రామస్వామి,  కన్నెగంటి హనుమంతు పేర్లను జిల్లాలకు నామకరణం చేయాలి.

8) ప్రతి జిల్లాలో కాపు భవనాలను నిర్మించాలి, ప్రత్యేక నిధులు కేటాయించాలి.

9) అన్ని రాజకీయ పార్టీలు కాపుల సమస్యలపై స్పందించి వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి.

ఈ కార్యక్రమంలో మాజీ చీఫ్ కమిషనర్ రంగశెట్టి మంగబాబు,  జేఏసీ గౌరవ అధ్యక్షులు  ఆకుల రామకృష్ణ, జేఏసీ కన్వనర్ లుముత్యాల రామదాసు, వాసిరెడ్డి ఏసుదాసు,మరియు  తోట రాజీవ్,మంచాల సాయి సుధాకర్, ఆరేటి ప్రకాష్, నల్లా విష్ణు,  పిచ్చయ్య నాయుడు,ఆకుల శ్రీనివాస్,అక్కల గాంధీ,కొండేటి రాజేంద్ర, సుంకర సాంబ శివరావు,కాపు జేఏసీ నాయకులు జొన్న రాజేష్, దీపిక నాయుడు,కమ్మెల రజినీ, పులిగడ్డసత్యనారాయణ,కాపు జాతి ఉండవల్లి కమిటీ అధ్యక్షులు ప్రదీప్, కార్యదర్శి దుర్గా మల్లేశ్వరరావు, కోశాధికారి గాజుల సురేష్, కాపు ప్రతినిధులు సభ్యులు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.