కులతత్వాన్ని ఎఫ్ ఆర్టీఐ సహించదు,ప్రత్తిపాటి నిజాయితీ కి పెద్ద పీట,సీటిల్మెంట్లు కు దూరం

కులతత్వాన్ని ఎఫ్ ఆర్టీఐ సహించదు,ప్రత్తిపాటి నిజాయితీ కి పెద్ద పీట,సీటిల్మెంట్లు కు దూరం

కులతత్వాన్ని ఎఫ్ ఆర్టీఐ సహించదు,ప్రత్తిపాటి నిజాయితీ కి పెద్ద పీట,సీటిల్మెంట్లు కు దూరం

జనచైతన్య న్యూస్- తుళ్లూరు

 అమరావతి జిల్లా తుళ్ళూరు ఫోరమ్ ఫర్ ఆర్టీఐ లో కులతత్వాన్ని సహించబోమని జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ కార్యకర్తలకు హిత బోధ చేశారు.శనివారం ఏపీ రాజధాని అమరావతి లోని తుళ్ళూరు విచ్చేసిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు.పుచ్చలపల్లి సుందరయ్య తన పేరు కు రెడ్డి ఉన్న తోకను తీసివేసి,తన ఆస్తి అంతా ప్రజలకు ఇచ్చి,పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి కున్న దళిత మహిళను వివాహమాడి కులరహిత సమాజానికి నాంది పలికి సుందరయ్య గా చరిత్రలో ప్రజల హృదయాల్లో నిలిచారని చెప్పారు.216 దేశాల్లో ఒక్క భారత దేశంలో మాత్రమే కుల వ్యవస్థ ఉందని,కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని చంద్రమోహన్ పిలుపు నిచ్చారు.నీతి నిజాయితీ గల వారికి ఎఫ్ ఆర్టీఐ లో మంచి స్థానం కల్పిస్తామన్నారు,సెటిల్ మెంట్లు కు ఎఫ్ ఆర్టీఐ దూరంగా ఉంటుందని,ఎవరైనా ఉంటే వారి వివరాలు పోలీసులకు తెలిపి సంస్థ నుండి బహిష్కరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.ప్రజల కోసం స్వచ్ఛందంగా పని చేయాలనే వారు ఎఫ్ ఆర్టీఐ లో జాయిన్ అవ్వాలని కోరారు,ఆయనతోపాటు మండల అధ్యక్షులు నల్లగొండ రాము,సిపిఎం నాయకులు బాబు, తదితరులు పాల్గొన్నారు.