రిమాండు ఖైదీ పరారీ పట్టుకున్న ఉరవకొండ పోలీసులు
రిమాండు ఖైదీ పరారీ పట్టుకున్న ఉరవకొండ పోలీసులు
జనచైతన్య న్యూస్- గుత్తి
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలం టి.కొత్తపల్లి గ్రామానికి చెందిన నరేశ్ పలు చోరీలు, గంజాయి కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. మతిస్తిమితంలేని వ్యక్తిగా ప్రవర్తిస్తుండటంతో 2నెలల కిందట విశాఖలోని పిచ్చాసుపత్రిలో చేర్చించారు. పిచ్చి నయంకావడంతో అతడిని బుధవారం అనంత ఏఆర్ పోలీసులు విశాఖ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలుకు బయలుదేరారు. రైల్వేస్టేషన్లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఉరవకొండ పోలీసులు నరేశ్ ను పట్టుకొని రిమాండ్కు తరలించారు.