శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణం వాస్తవం

శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణం వాస్తవం

యాడికి యాడికిమండలంలోని శ్రీరాముని దేవాలయాలు ఆంజనేయస్వామి దేవాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనం గా నిర్వహించారు. హాస్పిటల్ కాలనీ లోని రాములవారి గుడి, కోన రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి, చింతవనం ఆంజనేయస్వామి దేవాలయాలలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు హోమ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. హాస్పిటల్ కాలనీ రాములవారి గుడిలో ప్రత్యేక ఆకర్షణగా కోలాటం కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ విచ్చేసిన భక్తులు కోలాటాన్ని తిలకించి పిల్లలకు అభినందనలు తెలియజేశారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్ని దేవాలయాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆయా ఆలయ కమిటీ సభ్యులు సేవకులు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.