ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం స్తుతిమించిన అబ్జాదారుల పర్వం

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం  స్తుతిమించిన అబ్జాదారుల పర్వం

నిద్ర అవస్థలో రెవెన్యూ అధికారులు జోల పాడుతున్న మున్సిపాలిటీ అధికారులు  

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తగ్గని కబ్జా రాయుళ్లు రెవిన్యూ అధికారుల ఆదేశాలు భేఖాతర్ టాక్టర్లతో దున్ని సాగుకు సిద్ధం చేసిన కబ్జాదారులు మోటర్లు పెట్టి నీటితో నింపుతున్న కబ్జారాయుళ్లు 

వరుస సెలవులు కావడంతో అవకాశంగా మల్చుకున్న కబ్జా రాయుళ్ళు.  ఇబ్రహీంపట్నం జగనన్న కాలనీ సమీపంలో రెవిన్యూ, ఇరిగేషన్, లంక పోరంబోకు భూమి 5 ఎకరాలు కబ్జా... ?

కబ్జా రాయుళ్లు తగ్గేలా లేరు. రెవిన్యూ అధికారుల ఆదేశాలను భేఖాతర్ చేస్తూ మోటర్లు పెట్టి మరి  నీటితో నింపుతున్నారు. కొన్ని రోజుల క్రితం చెట్లు తొలగిస్తుంటే రెవిన్యూ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. రెండు,మూడు రోజుల అగి మరలా పనులు ప్రారంభం చేయడంతో రెవిన్యూ అధికారులు స్థలంలో పనులు చేస్తే చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. మూడు రోజులు అధికారులకు సెలవులు ఉండటంతో అవకాశం చూసుకున్న కబ్జారాయుళ్లు మోటర్లు పెట్టి మరి నీటితో నింపడం ఇప్పుడు చర్చ గా మారింది. పేదలు చిన్న స్థలంలో గుడిసె వేస్తే పరుగున్న వచ్చే అధికారులు కోట్ల విలువ చేసే భూమి కబ్జాకు గురువుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు.