విజయవాడ చిట్టినగర్ లో కొత్త అమ్మవారి గుడి లో దసరా మహోత్సవం
విజయవాడ చిట్టినగర్ లో కొత్త అమ్మవారి గుడి లో ఈ నెల 3తేదీ నుండి 12 వరకు జరుగును . విజయవాడ-జనచైతన్యన్యూస్- (తమ్మినగంగాధర్ ) బ్రహ్మాండమైన దసరా మహోత్సవాలకు ప్రజలు తరలివచ్చి దుర్గమ్మ దర్శించి ఆశీస్సులను ఉండవలెనని కోరుచున్నాము . అశేష ప్రజానీకంతో ప్రతిరోజు దేవస్థానంలో మెంబర్లకు పూజా సామాగ్రి, ప్రసాద వితరణలు జరుగును . కళాకారులచే భరతనాట్యం,హరికథ,అమ్మవారి కళాత్మకతను వివరిస్తూ ప్రతిరోజు ప్రత్యేకమైన ప్రసాదాలు వితరణ 13 వ తేదీ అమ్మవారి చీరల వేలం ,భక్తులకు, ప్రజలకు అన్నప్రసాదాలు, సాయంత్రం భక్తి జనులతో,కోలాహలంగా అమ్మవారి ఊరేగింపు జరుగును.దీనిలో దేవస్థాన కమిటీ పాల్గొన్నవారు. ప్రెసిడెంట్ : మరుపిల్ల హనుమంతరావు,సెక్రెటరీ : ఈదిఎల్ల రాజారావు,కన్వీనర్ : లింగిపిల్లి అప్పారావు,పిల్లశ్రీనివాస రావు, బెవర శ్రీనివాసరావు ,బాయన శ్రీనివాసరావు,పోతిన ధర్మారావు,తదితరులు పాల్గొన్నారు.