సత్య సాయి జిల్లా కలెక్టరేట్ వద్ద తాళిబజావ్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

సత్య సాయి జిల్లా కలెక్టరేట్ వద్ద తాళిబజావ్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

సత్య సాయి జిల్లా కలెక్టరేట్ వద్ద తాళిబజావ్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

జనచైతన్య న్యూస్-సత్యసాయి 

సత్యసాయి జిల్లా లో జిల్లా డిసిసి ప్రెసిడెంట్ యం హెచ్ ఇనయ్ తుల్లా, రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు కోటా సత్యం, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ బి కదిరప్ప, మాట్లాడుతూ రాష్ట్ర ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలనలో సంక్షేమం నిల్  అభివృద్ధి శూన్యం అని, మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప దాటడం లేదనీ సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎప్పుడు, రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాప్ అని పేర్కొన్నారు. నిద్రావస్థలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపెందుకు తాళిబజావ్ కార్యక్రమం నిర్వహించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, ఎన్ ఎస్ యు ఐ, కిసాన్ సెల్, ఐ ఎన్ టి యు సి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సేవాదళ్, లీగల్ సెల్, పంచాయతీరాజ్, ఆర్టీసీ తదితర పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.