కొండ ప్రాంత 2 డివిజన్ ప్రజలకు మెట్లు,లార్డింగ్స్-సీసీ డ్రైన్ నిర్మాణం

కొండ ప్రాంత 2 డివిజన్ ప్రజలకు మెట్లు,లార్డింగ్స్-సీసీ డ్రైన్ నిర్మాణం

కొండ ప్రాంతంలో 2 డివిజన్

ప్రజలకు మెట్లు,లాడింగ్స్,   సిసిడ్రైన్స  నిర్మాణం

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

రెండవ డివిజన్ లో స్ధానిక కార్పొరేటర్ నిర్మల కుమారి నాయకత్వంలో శ్రీలంక కొండ ప్రాంతంలో 34 లక్షల రూపాయల వ్యయంతో స్టెప్స్,లాడింగ్స్ మరియు సి.సి డ్రైన్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మేయర్ రాయణ భాగ్యలక్ష్మీ,వైసీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ. దేవినేని అవినాష్ కామెంట్స్.

తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అమలు జరిగాయి.

స్థానిక ప్రజలు రోడ్లు, డ్రైన్లు సమస్య తమ దృష్టికి తీసుకురాగానే వాటిని పరిష్కారం చేసాం.

కొండ ప్రాంతంలో రోడ్లు వేయాలంటే అధికారులకు కాంట్రాక్టర్లకు చాలా కష్టమైన పని ప్రజల సౌకర్యం కోసం ఎంత కష్టమైనా రోడ్లు నిర్మాణం పూర్తి చేసాం. గత ప్రభుత్వం కొండ ప్రాంతవాసులను చిన్నచూపు చూసింది. జగన్ పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కొండ ప్రాంతoలో మౌలిక వసతులు కల్పించాo. టిడిపి ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏమి చేయలేకపోయింది.

అబద్దాలతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేశారు. ఎన్టీఆర్ కాలనీ వెటర్నరీ కాలనీ ఎక్సైజ్ కాలనీలలో పెద్దలు ఎవరు లేకపోయినా తూ తూ మంత్రంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశాలు నిర్వహించాడు. 2014 నుంచి 2019  రెండు వేల రెండు వందల  కోట్లు రోడ్లు,డ్రెయిన్లు కోసం ఖర్చు పెట్టాం అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెబుతున్నాడు. 

ఆ రోడ్లు,పార్కులు,వాటర్ ట్యాంకు లు ఎక్కడ ఉన్నాయో చూపించు అసలు ఆ డబ్బులు ఏమి అయిపోయాయి నిజం తెలియాలి. మేము ఖర్చు పెట్టిన 650 కోట్ల గురించి మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం.దానిపై నేను మాట్లాడితే రచ్చ అవుతుంది అనిగద్దెతప్పించుకుంటున్నారు.అభివృద్ది చేసింది మేము కాబట్టి మాట్లాడే దమ్ము నికు లేదు.ఏ కాలని ల్లో నువ్వు మీటింగ్ లు పెట్టవో అక్కడ అభివృద్ది పనులు జరిగినప్పుడు బొప్పన భవాకుమర్ మాతో పాటే ఉన్నాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న భవకుమార్ ని అడుగు వాస్తవం తెలుస్తుంది.

గద్దె రామ్మోహన్ చేతకాని వాడు అని అప్పుడు భావకుమర్ కూడ విమర్శలు చేశాడు. ఏ ప్రభుత్వంలో రోడ్లు,డ్రెయిన్లు సమస్య పరిష్కారం అయిందో 

ప్రజలకు తెలుసు  వైసీపీ హయాంలో శంకుస్థాపనలు చేసినప్పుడు గద్దె పై ఫిర్యాదులు చేసినవారే తోనే ఇప్పుడు సమావేశం అయ్యాడు. దమ్ముంటే మీడియా ముందే చర్చకు రావాలి.మీరు ఏమి చేయలేకపోయారనే కాలని వాసులoదరు మిమ్మలను చీ కొడుతున్నారు. 70 ఏళ్ల గద్దె రామ్మోహన్ 35 ఏళ్ల అవినాష్ ని చూసి భయపడుతున్నాడు.

మమ్మల్ని రౌడీలు అంటున్న గద్దె రామ్మోహన్ అతని రక్తంలో కాల్ మని,బెట్టింగ్,పేకాట ఉందా చెప్పాలి. తూర్పు నియోజకవర్గo లో టీడీపి ఓడిపోయే పరిస్తితి రావటంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు.

ప్రజలు ఎవరు టీడీపి నేతలు నీ నమ్మే పరిస్తితి లో లేరు

చనిపోయిన వైఎస్ఆర్,దేవినేని నెహ్రూగురించిమాట్లాడుతున్నాడు.దమ్ముంటే చేసిన అభివృద్ది గురించి మాట్లాడాలి

రిటైనింగ్ వాల్ నువ్వే కడితే అప్పుడు ఇండ్లు ఎందుకు మునిగాయో చెప్పాలి.

70 ఏళ్ల వయసులో గద్దె రామ్మోహన్ తన సినిమా మోజు తీర్చుకుంటూ రీల్స్ చేసుకుంటున్నాడు.నియోజకవర్గంలో గడప గడపకు తిరిగాం కాబట్టే దైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం.టిడిపి చేసిన సర్వేలో54 శాతం వైసీపీ కి,,40 శాతం టీడీపి కి అనుకూలంగా వచ్చింది.మేము చేసిన కార్యక్రమాలే మాకు   శ్రీ రామ రక్ష .