నారీ శక్తి వందన్ మారదన్ - జాతీయ బిజెపి పార్టీ

నారీ  శక్తి వందన్  మారదన్  -  జాతీయ బిజెపి పార్టీ

భారతీయ జనతా  మహిళా మోర్చా  జాతీయ పార్టీ ఆదేశాల మేరకు -నారి శక్తి వందన్   మారథాన్ 

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

విజయవాడ వన్ టౌన్, కొత్తపేట K B N కాలేజి నుండి 2k వాక్ జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదిగారు మహిళాసాధికారతకు అభివృధ్దికి పెద్ద పీఠ వేస్తున్నారని,మహిళలకు రాజకీయంగా 33% రిజర్వేషన్లు కల్పించడం,మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఉచిత మరుగు దొడ్లు నిర్మించడం,మహిళల వంటింటి కష్టాలు తీర్చడానికి ఉజ్వల యోజన పథకం,అలగే గర్బం దాల్చిన మహిళలకు పౌష్టికాహారం అందించడం,ప్రసూతి సెలవులు పెంచడం,ప్రశవించిన మహిళలకు 6 వేల రూపాయల ఆర్దికసాయంఅందించడం,ముస్లిం మహిళల కష్టాలు తీర్చడానికి త్రిబుల్ తలాక్ ని రద్దు చేయడం వంటి ఎన్నో పథకాలను మహిళల కోసం ప్రవేశపెట్టారని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సాతినేని యామిని,ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్,బిజెపి NTR జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు యర్రా సునితా,జోనల్ ఇంఛార్జ్ లక్ష్మి,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొలపల్లి గణేష్,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మదేవర రత్న  కుమారి,బిజెపి జిల్లా కార్యదర్శులు నున్న కృష్ణ,ఉమాకాంత్ తదితర బిజెపినాయకులుపాల్గొన్నారు.NP కుమార్

NTR జిల్లా BJP