విద్యుత్ సంస్థలలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి

విద్యుత్ సంస్థలలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి

విద్యుత్ సంస్థలలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి

 జనచైతన్య న్యూస్- కదిరి

 సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఏపీ ఎస్ ఈ ఈ వి 327 (ఐ ఎన్ టి యు సి) అనుబంధ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం బి-2841 కదిరి డివిజన్ సర్వసభ్య సమావేశం, ఏపీఎన్జీవో హాల్ లో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఎస్ ఈ ఈ వి 327 రాష్ట్ర సెక్యూరిటీ జనరల్ యం వి రాఘవరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కార్మికులను వెంటనే దళారి వ్యవస్థను రద్దు చేసి విద్యుత్ సంస్థ వారి సేవలను గుర్తించి నేరుగా వేతనం చెల్లించాలని అలాగే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆయన 1998 సంవత్సరంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు, ఐ ఎన్ టి యూ సీ జాతీయ అధ్యక్షుడు జి సంజీవరెడ్డి సమక్షంలో విద్యుత్ యజమాన్యం, కార్మిక సంఘాలు మధ్య జరిగిన, త్రేపాక్ష ఒప్పందాన్ని యాజమాన్యం పాటించడానికి తమకు నచ్చిన విధంగా విద్యుత్ ఉద్యోగుల హక్కులకు కాలారాస్తూ ఇష్టరాజ్యంగా ఆర్డర్లను, రెవిన్యూయేషన్ మారుస్తున్నారని ఆరోపించారు. అలాగే ఈ సమావేశంలో బి 2841 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్లూరు నాగార్జున మాట్లాడుతూ దశాబ్దాల తరబడి విద్యుత్ సంస్థలను నమ్ముకొని తక్కువ వేతనంతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చెయ్యాలని, 2022 వేతన సవరణ బాకాలు వెంటనే చెల్లించాలని విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వైద్య సదుపాయాలను కల్పించాలని సంస్థలోని పని చేస్తున్న బకే కేడర్ కాంట్రాక్టుకు కార్మికుడికి ఒకే వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎ ఈశ్వర్ బాబు, గంగిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నరసింహులు, రంగారెడ్డి, జనార్దన్, లోకేష్, విశ్వనాథ్, హరినాథ్ తదితర కార్మికులు పాల్గొన్నారు.