ఫోరం ఆర్టిఐ అభివృద్ధి పదంలో పై స్థాయికి ఎదుగుతున్న-చంద్రమోహన్

చంద్రమోహన్ ను అభినందిస్తున్న ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ - ఉల్చాల
విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)
మంగళగిరి నీతి, నిజాయితీ గా న్యాయ బద్దంగా సమాచార హక్కు చట్టాన్ని,హ్యుమన్ రైట్స్ ను ప్రజలకు అవగాహన కల్పిస్తూ దేశ,ప్రపంచ స్థాయిలో సోషల్ వర్కర్ గా రెండు అంతర్జాతీయ, 5 జాతీయ అవార్డులు పొందిన ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ చేస్తున్న కృషి అభినందనీయం అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ ఉల్చాల హరి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం ఏపీ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో కమిషనర్ హరి ప్రసాద్ రెడ్డి నీ చంద్రమోహన్, ఏపీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎన్. విక్టర్ పాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. హిరింగ్ కు వచ్చిన కేసులు సత్వరమే పరిష్కరించాలని, నష్ట పరిహారం, జరిమానాలు విధించాలని, ఆర్టీఐ అవగాహనను రాష్ట్రంలో సదస్సులు ,సమావేశాలు నిర్వహించాలని వారు కమిషనర్ హరిప్రసాద్ రెడ్డి నీ కోరారు. తమ సంఘం ద్వారా జాతీయ స్థాయిలో ఆర్టీఐ ఖ్యాతి నీ ఇనుమడింప జేయ టం మంచిపరిణామం అన్నారు.ఫోన్ 9676211151 ద్వార ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వంతో కలసి పని చేస్తున్నట్లు విక్టర్ పాల్ తెలిపారు.