78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు,ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్

జనచైతన్య న్యూస్-యాడికి 

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం, మేజర్ పంచాయతీ కార్యాలయాల్లో ఎంపీపీ ఉమాదేవి బొంబాయి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో మండల పరిషత్ గ్రామపంచాయతీ  అధికారులు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు,ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ హాజరై మువ్వన్నెల జెండాను ఎగరవేయడం జరిగింది.అనంతరం మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలంతోనే మనం ఈరోజు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని,కావున ప్రతి పౌరుడు మన గ్రామ స్వరాజ్యం అభివృద్ధికై కట్టుబడి మన ఇంటిని మన గ్రామాన్ని మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ఆయన పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,ఎంపీటీసీలు,సర్పంచులు,వార్డు మెంబర్లు,మండల స్థాయి అధికారులు,సచివాలయ సిబ్బంది,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.