అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న సిపిఐ ప్రజా సంఘాలు

అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న సిపిఐ ప్రజా సంఘాలు

*అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న సిపిఐ మరియు ప్రజా సంఘాలు* 

ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం సంతేబిదనూరు వద్ద అక్రమంగా ఇసుక తోలుతున్న పది ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్న సిపిఐ మరియు ప్రజా సంఘాల నాయకులు.... ఇసుక గత మూడు నెలల నుండి అక్రమంగా ఫేక్ బిల్లులు చూపిస్తూ రోజు 300 ట్రాక్టర్లు తోలుతూ అక్రమ సంపాదన ధ్యేయంగా వ్యవహరిస్తున్న ఇసుక మాఫియా పైన వెంటనే కలెక్టర్, సేబ్ అధికారులకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన అధికారులు మండల ఎమ్మార్వో కార్యాలయం వద్దకు ఇసుక ట్రాక్టర్లు తరలించడం జరిగింది.ఈసందర్భంగా సీపీఐ హిందూపురం కార్యదర్శి కనిసెట్టిపల్లి వినోద్ కుమార్ మరియు తుమకుంట పారిశ్రామిక వాడా కార్మిక సంఘం అధ్యక్షులు రవికుమార్, జై భీమ్ భారత్ రావు పార్టీ నాయకులు నాగరాజు మాట్లాడుతూ పెన్నా నదిలో అక్రమ ఇసుక రవాణా చేస్తూ కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దండుకొంటు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు సహకరిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ఇసుక మాఫియా పెద్ద ఎత్తున పేట్రేగిపోతూ రోజు పెన్నా నది నుండి 300 ఇసుక ట్రాక్టర్ల ద్వారా కర్ణాటకకి తరలిస్తూ నకిలీ బిల్లులు చూపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రతిరోజు లాగే ఈరోజు కూడా అదే విధంగా తరలిస్తున్న సందర్భంలో పెన్నా నదిలోకి వెళ్లి అడ్డుకోవడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎమ్మార్వో గారికి ఫోన్ ద్వారా తెలియజేయడంతో వెంటనే స్పందించి పెన్నా నది ఇసుక తోడుతున్న చోటుకు అధికారులు రావటం జరిగిందిపెన్నా నదిలో అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు ఇంకి పోయి రైతుల బోరులు, బావులు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వనరు అయిన ఇసుకను అమ్మకొంటూ సొమ్ము చేసుకుంటున్న వారి పైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారుఈకార్యక్రమంలో సిపిఐ నాయకులు సమీవుల్లా, అంజాద్, జియా, అబూబకర్, కమల్ భాష, తుమకుంట పారిశ్రామిక వాడా కార్మిక సంఘం నాయకులు బాబు, మూర్తి, జై భీమ్రావ్ భారత్ పార్టీ గణేష్, గంగాధర్ పాల్గొన్నారు*