ముదిగుబ్బ మండలంలో సిఐటియు కన్విన్ కమిటీ ఎన్నిక
ముదిగుబ్బ మండలంలో సిఐటియు కన్విన్ కమిటీ ఎన్నిక
జనచైతన్య న్యూస్- ముదిగుబ్బ
సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలో నేడు సిఐటియు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ముదిగుబ్బ మండలంలో ముదుగుబ్బ సిఐటియు కన్విన్ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమం సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్ వెంకటేశ్వర్లు, శ్రామిక మహిళా అధ్యక్షురాలు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ముదిగుబ్బ సొసైటీ ఆవరణంలో రైతు బజార్లో ఏర్పాటు చేయడం జరిగింది. సిఐటియు సమన్వయ కమిటీలో సిఐటియు మండల కన్వీనర్ గా బండల వెంకటేష్ ను, కన్వీనర్లుగా సూర్యనారాయణ, స్టాక్ పాయింట్ పంచాయతి వర్కర్ ఓబులేసు, ఆటో యూనియన్ శివకుమార్, అంగన్వాడి అధ్యక్షురాలు రజియాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిఐటియు నూతన కన్వీనర్ బండల వెంకటేష్ మాట్లాడుతూ నాకు అప్పగించినటువంటి బాధ్యతలను సిఐటియు అనుబంధ సంస్థలను కలుపుకొని ప్రతి శ్రామికుల కోసం శ్రమిస్తానని అన్నారు, సహకరించిన సిఐటియు వారికి కృతజ్ఞతలు తెలిపారు.