ఎమ్మార్పీఎస్ 30 వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం

ఎమ్మార్పీఎస్ 30 వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం

ఎమ్మార్పీఎస్ 30 వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం

 జనచైతన్ న్యూస్- పెద్దవడుగూరు 

 అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో  ఎమ్మార్పీఎస్ 30 వ సంవత్సరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిసె భూపతి మాదిగ, తాడపత్రి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రామాంజనేయులు మాదిగ ఆధ్వర్యంలో తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండల కేంద్రంలో మరియు అప్పేచెర్ల గుత్తి అనంతపురం విరుపాపురం వెంకటం పల్లి గ్రామాలలో పెద్దవడుగూరు మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఎమ్మార్పీఎస్ సృష్టికర్త వికలాంగుల ఆత్మబంధువు వృద్ధులు వితంతువులు కుమారుడు నవయుగ అంబేద్కర్ మాన్య మందకృష్ణ మాదిగ 59వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం పై గ్రామాలలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణలు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ మాట్లాడుతూ

రాజ్యాంగం స్ఫూర్తి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కొరకు నేటితో ఎమ్మార్పీఎస్ సామాజిక ఉద్యమం పోరాటానికి 30 ఏళ్లగా నిలిచి ఒక కుల సంఘం తమ న్యాయమైన ఎస్సీ వర్గీకరణ కోసం విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో వెనకబడినటువంటి సామాజిక వర్గాల కోసం ఎస్సీ జాబితాలో 59 కులాల వారి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు వాటాను పంచాలన్న ఏకైక నినాదంతో మూడు శతాబ్దాలుగా సుదీర్ఘ పోరాటం నడిపిన చరిత్ర భారతదేశం లోని ఒక ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి దక్కిందని అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాన్ని పునరుద్ధరణ అనాధ పిల్లల కోసం పెన్షన్లు వృద్ధులు వితంతువులు వికలాంగులకు ఈరోజు ఆరువేల రూపాయల పెన్షన్ను పెరగడానికి మహానేత మందా కృష్ణ మాదిగ ఉద్యమ సూక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్దవడుగూరు మండల అధ్యక్షుడు గూడూరు రంగస్వామి మాదిగ, మండల ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు అంజి, గుత్తి అనంతపురం సుధాకర్ మాదిగ, అప్పేచెర్ల పెద్దలయ్య సుధాకర మద్దిలేటి శ్రీనివాసులు ఓడుగూరు సింగన్నతదితరులు పాల్గొన్నారు.