మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద 230 కేజీల గంజాయి స్వాధీనం

మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద 230 కేజీల గంజాయి స్వాధీనం

మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద 230 కేజీల గంజాయి స్వాధీనం 

జనచైతన్య న్యూస్- మంగళగిరి

తమిళనాడుకు చెందిన 5గురు నిందితుల ఆరెస్ట్ 2 కార్లు, 6 సెల్ ఫోన్లు, 34 వేల నగదు స్వాధీనం .వివరాలను వెల్లడించిన సెబ్ జిల్లా అడిషనల్ ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు. దిశ మంగళగిరి రెండు కారులలో 230 కేజీల గంజాయిని తుని నుండి తమిళనాడుకు తరలిస్తుండగా,శుక్రవారం రాత్రి స్టేట్ టాస్క్ ఫోర్స్ సమాచారం మేరకు కాజా టోల్ గేట్ వద్ద మంగళగిరి సెబ్ అధికారులు పట్టుకున్నారు.తమిళనాడుకు చెందిన 5 గురు నిందితులను ఆరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు కార్లు,6 సెల్ ఫోన్లు,34 వేల రూపాయల నగదును స్వాథీనం చేసుకున్నారు.మంగళగిరి సెబ్ కార్యాలయంలో గుంటూరు జిల్లా సెబ్ అడిషనల్ ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు.మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనీఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ముందస్తు సమాచారం మేరకు చేపట్టిన తనీఖీలలో భాగంగా కాజా టోల్ గేట్ వద్ద శుక్రవారం రాత్రి తనీఖీలు చేపట్టాగా,కారులో 230 కేజీల గంజాయిని గుర్తించటంతో పాటు 5గురు నిందితులను ఆదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.పట్టుకున్న గంజాయి విలువ 30 లక్షలు ఉంటుందన్నారు. తమిళనాడు పూడుకొట్టాయి అర్నాతాంగి కి చెందిన మమ్మద్ అమీర్,కైలాయిముద్దాన్, షేక్ అబ్దులా,కార్తీకేయాన్, ఎస్ మల్లిఖార్జున లుగా గుర్తించి ఆరెస్ట్ చేసినట్లు తెలిపారు.జిల్లా సెబ్ అడిషనల్ ఎస్పీ ఎల్ రంగారెడ్డి, స్టేట్ టాస్క్ ఫోర్స్ సిఐ ఎ అనంద్, మంగళగిరి సెబ్ సిఐ పి ప్రసన్న లక్ష్మీ, ఎస్ఐ రాజేంద్రప్రసాద్, సిబ్బంది రామాంజనేయులు, వై గోపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు