అగాపే వృద్ధాశ్రమంలో 78వ స్వాతంత్ర దినోత్సవంలో వేడుకలు
అగాపే వృద్ధాశ్రమంలో 78వ స్వాతంత్ర దినోత్సవంలో వేడుకలు
జనచైతన్య న్యూస్-యాడికి
అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో ఆగస్టు 15వ తారీఖున 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు.గ్రామ పెద్దలు,పోలీస్ స్టాప్ అందరూ కలిసి జెండా వందనం చేశారు.అలాగే వైసీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు మాట్లాడుతూ మన పూర్వీకులు ఎంతోమంది దేశం కోసం త్యాగం చేశారన్నారు.వారి త్యాగమే ఈనాడు మనకు స్వాతంత్రం,అలాగే సి ఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ దేశభక్తి కోసం ఎంతోమంది తమ ప్రాణాలు త్యాగం చేశారు.శాంతికి చిహ్నంగా పావురం కూడా ఎగరవేశారు.స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ కేక్ కటింగ్ కూడా చేయించారు. జడ్పిటిసి వెంకట్ నాయుడు కూడా స్వాతంత్రం గురించి మాట్లాడారు,ఆశ్రమ పౌండర్ బత్తుల ప్రసాద్ వారికి సాలువాలు కప్పి సన్మానం కూడా చేశారు.అనేక మంది గ్రామ పెద్దలు,ప్రజలు వేడుకలో పాల్గొన్నారు,వచ్చిన వారందరికీ అల్పాహారము స్వీటు అందజేశారు,ఆశ్రమ ఫౌండర్ బత్తుల ప్రసాద్ సతీమణి యెమిమా వారి పిల్లలు క్యాథలిన్,కెనీత్,ఆశ్రమ సభ్యులు బాలకృష్ణ, లక్ష్మీరెడ్డి,ఆశ్రమంలో ఉన్న వారు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.