ఎఫ్ ఆర్ టి ఐ సమాచార శాఖహక్కు చట్టాలు సంస్థ-తిరుపతి
ఎఫ్ ఆర్టీఐ ఆర్టీఐ ఆర్టీఐ సమాచార హక్కు చట్టంలోని ముఖ్యమైన కొన్ని సెక్షన్లు
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
దరఖాస్తు, అప్పీలు, నష్టపరిహారం ఇతరములపై కొద్దిగా అవగాహన:
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 13 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టాన్ని భారతదేశమంతటా అమలులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డు మీద స్పష్టంగా రాసి ఉంచాలి. సమాచార హక్కు చట్టంలో మెుత్తం 6 అధ్యాయాలు, 31సెక్షన్లు ఉన్నాయి. సమాచార దరఖాస్తు చట్టం అప్లికేషన్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామాతో కలిపి, 500 పదాలకు మించి వుండరాదు. అయితే అప్లికేషనుకు అనుబంధం వుంటే అది లెక్కలోకిరాదు. అయినాకానీ, పదాల పరిమితి పెరిగిందనే కారణంతో ఎవరి దరఖాస్తును తిరస్కరించడానికి వీల్లేదు. సమాచార దరఖాస్తు దారునికి వయసు, విద్య, స్థానికత అవసరం లేదు. అడుగుతున్న సమాచారాన్ని ఎందుకు అని అడిగే హక్కు పౌర సమాచార అధికారికి లేదు. సెక్షన్6(2) ప్రకారం సమాచారం ఎందుకో చెప్పనక్కరలేదు.సమాచారం తీసుకోవడానికి ఏ భాషను ఉపయోగించాలి?.
మీకు కావలసిన సమాచారాన్ని ఇంగ్లీషు / హింది / స్థానిక భాషలలో అడగొచ్చు. దరఖాస్తును పంపుతున్న ప్రాంతంలోని అధికార భాషగా గుర్తించిన ప్రాంతీయ భాషలో అడగొచ్చు. సహ చట్ట దరఖాస్తును నింపడానికి ఏదైనా ఖచ్చితమైన నమూనా వుందా? సమాచారాన్ని కోరుతూ దాఖలు చేసుకునే దరఖాస్తు ఫారానికి ప్రత్యేకమైన ఫార్మెట్ ఏమీ లేదు. తెల్లటి పేపరు మీద కావలసిన సమాచార వ్రాసి అడగవచ్చు. కానీ దరఖాస్తు దారుడు ఈ క్రింది వివరాలు రాయాల్సివుంటుంది.1దరఖాస్తు తేది, 2.సంబంధిత పౌర సమాచార అధికారి చిరునామా, 3.దరఖాస్తుదారుని చిరునామా, 4.కోరదల్చుకున్న సమాచారం (స్పష్టత కోసం నంబర్లవారీగా కానీ, టేబుల్ రూపంలో గానీ వుంటే మంచిది. దానికి ప్రతిస్పందనలు కూడా అదే రూపంలో ఉంటాయి.)
దరఖాస్తు బదిలీ.
మీరు కోరిన సమాచారం సంబంధిత కార్యాలయ అధికారి పరిధి కిందకు రాని యెడల పిఐఒ / సంబంధిత అధికారి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 6 (3) ప్రకారం 5 రోజుల్లో బదిలీ చేయాలి. మీరు కోరిన సమాచారం మా పరిదిలోకిని రాదు అని దరఖాస్తుదారునికి దరఖాస్తును వెనుకకు పంపరాదు. బదిలీ విషయంకూడాదరఖాస్తుదారుడికి తెలియజేయాలి. సంబంధిత అధికారి దరఖాస్తు దారుడు కోరిన సమాచారం కోరిన విధంగా అందించాలి.
దరఖాస్తు రుసుము.
నగదు రూపంలో చెల్లించొచ్చు. ఇండియన్ పోస్టల్ ఆర్డర్లు (లేదా) డిమాండ్ డ్రాఫ్టు ద్వారా చెల్లించొచ్చు. కోర్టు ఫీ స్టాంపు రూపంలో కూడా చెల్లించొచ్చు. (కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కోర్టు ఫీ స్టాంపులు చెల్లుబాటు కాదు). బ్యాంకర్స్ చెక్కురూపంలో మాత్రమే దరఖాస్తు రుసుమును ఎకౌంట్ అధికారి పేరిట పంపించాలి. కోరిన సమాచారాన్ని బట్టి వాటి ప్రింటౌట్స్ కి పేజీకి రూ.2/- చొప్పున చెల్లించాలి. అదనపు చార్జీలు ఎవైన ఉంటే, ఆఫీసరు తన జవాబులో తెలియజేస్తారు. మీరు కోరిన గడువు (జాప్యం చేసి 48 గంటలు /30 రోజులలోపు సమాచారాన్ని ఇవ్వకపోతే) దాటినాకా సమాచారం ఇచ్చే పౌర సమాచార అధికారి గారికి దరఖాస్తుదారుడి నుంచి ఎలాంటి ఫీజును వసూలు చేసే అవకాశం ఉండదు. పూర్తి ఉచితంగా సమాచారాన్ని ఇవ్వాల్సి వుంటుంది. గ్రామస్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు దరఖాస్తు రుసుము ఉచితం. మండల స్థాయిలో రూ5/- జిల్లా, రాష్ట్ర, కేంద్రస్థాయిలో రూ.10 చెల్లించాలి. కోర్టుకు పెట్టుకున్న దరఖాస్తు రుసుము రూ 25/- గా నిర్ణయించడం జరిగింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7(5) ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి దరఖాస్తు రుసుము ఉచితం. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7(3) ప్రకారం దరఖాస్తు రుసుమును నగదు లేదా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా బ్యాంక్ చెక్కు లేదా డీడీ లేదా చలానా లేదా నగదు రూపంలో చెల్లించవచ్చు.
సమచారం ఇచ్చేందుకు గడువు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 6 (1) ప్రకారం కోరిన సమాచారాన్ని సంబంధిత అధికారి 30 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. 2.సమాచార చట్టం సెక్షన్ 7 (1) ప్రకారం అడిగిన సమాచారం వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్చకు (లైప్ అండ్ లిబర్టీ కి) సంబందించిన అంశం అయితే దరఖాస్తు సంబంధిత అధికారికి ముట్టిన సమయం నుంచి 48 గంటలలోపు సమాచారం అందించాలి. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7 (6) ప్రకారం 30 రోజుల వ్యవధి దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాలి.
రికార్డులు తనిఖీ.
సెక్షన్ 2(j)(1) ప్రకారం పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు, అధికారం ఉంది. (మొదటి గంటకు ఉచితం. తర్వాత ప్రతి గంటకు రూ5/- చెల్లించాలి).సమాచారం కోసం అప్పీలు.పౌర సమాచార అధికారి గారు నిర్దేశించిన గడువులోగాఏవిషయాన్నితెలియజేయకపోతే సమాచారం ఇవ్వడానికితిరస్కరించినట్లుగానే భావించాలి. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 19(1) ప్రకారం ప్రభుత్వ కార్యాలయ ఉన్నత అధికారికి మొదట అప్పీలును చేయాలి. అప్పుడు సంబంధిత అధికారి 30 - 45 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. సెక్షన్ 19(3) ప్రకారం 90 రోజుల వ్యవధిలో రెండవ అప్పీలు చేసుకొనవచ్చు. సెక్షన్18(1) ప్రకారం కేంద్ర / రాష్ట్ర కమీషన్లకు అప్పీల్ చేయాలి. తదుపరి గడువును సమాచార కమీషన్ నిర్ణయిస్తుంది. మీరు సమాచారం కొరకు దరఖాస్తు ప్రజా సమాచార అధికారి గారికి దరఖాస్తు చేసుకొని ఉంటే మీ దరఖాస్తు స్వీకరించకుండా తిరస్కరిస్తే మీరు సమాచార హక్కు చట్టం కేంద్ర/కేంద్ర కమీషనర్లకు అప్పీల్ చేసుకొనవచ్చు.సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానా,శిక్షలు.దరఖాస్తుతీసుకోవడానికి నిరాకరించినా, దరఖాస్తు రుసుము ఎక్కువగా కోరినా, అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇచ్చినా, కోరిన సమాచారాన్ని ధ్వంసం చేసినా, ఇవ్వడాన్ని అడ్డుకున్నా సమాచార హక్కు చట్టం ప్రకారం నేరాలుగా పరిగణిస్తారు. వీటికి పాల్పడిన ప్రజా సమాచార అధికారికి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 20(1) ప్రకారం రోజుకు రూ.250 చొప్పున గరిష్ఠంగా రూ.25000 జరిమానా విధిస్తారు. తరచూ ఈ చట్టం ఉల్లంఘనకు పాల్పడే అధికారులపై సెక్షన్ 20(2) ప్రకారం క్రమశిక్షణ చర్యలు చేపడతారు. సమాచారం కోరిన సమయంలో మీ దరఖాస్తుకు ఏమైనా ఆర్థిక పరమైన నష్టాలు వచ్చి ఉంటే సెక్షన్-19(8)(b) ప్రకారం ధరాఖాస్తుదారు తనకు కలిగిన ఆర్థికపరమైన కష్టనష్టాల పై కమీషన్ కు ఆధారాలు సమర్పించాలి. సక్రమంగా ఉంటే నష్టపరిహారం మంజూరు చేయాలి. స్వచ్ఛంద వెల్లడి సమాచారం.సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన విధులు, బాధ్యతలు, విధి నిర్వహణలో పాటించే సూత్రాలు, జవాబుదారీతనం, ఉద్యోగుల వివరాలు, వారి జీతభత్యాలు, బడ్జెట్ కేటాయింపు, రికార్డుల పట్టికలు, రాయితీల వివరాలు, ప్రజా సమాచార అధికారి వివరాలు, సలహా సంఘాల సమాచారాన్ని కార్యాలయ నోటీసు బోర్డుల్లో స్వచ్ఛందంగా ఉంచాలి, వెల్లడించాలి.
ప్రతి పేజీకి దరఖాస్తు దారుడు ఎంతచెల్లించాలి.జి.ఒ.ఎం.ఎస్. నెం.454 ప్రకారంసమాచారాన్ని పొందేందుకు A3 లేక A4 కాగితానికి రూ.2, ప్లాపీకి రూ.50, సీడీకి రూ.100, డీవీడీకి రూ.200 చెల్లించాలి.
దరఖాస్తుదారుల మీద చర్యలు చేపట్టరాదు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం దరఖాస్తుదారుడిపై ఎలాంటి దావాలు, న్యాయవిచారణ, చట్టపరమైన చర్యలు తీసుకోరాదు.గడువులోగా సమాచారం ఇవ్వకుంటే పరిహారం.నిర్ణీత గడువులోగా సమాచారం లభించనప్పుడు సమాచార కమీషన్‌కు వెళ్లాల్సి వస్తే, సమాచార చట్టంలోని సెక్షన్ 19(8)(బి) ప్రకారం పరిహారం పొందవచ్చు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం సమాచార కమీషన్ జారీ చేసిన ఆదేశాలపై దావాను వేయరాదు. ఇతర విచారణనుఏ న్యాయస్థానాలు చేపట్టరాదు, ప్రశ్నించకూడదు. సమాచార హక్కు చట్టం ప్రచార బాధ్యతలు ప్రభుత్వాలవే. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం దీని ప్రయోజనాలను ప్రజలకు అందించి, వారిలో అవగాహన కల్పించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఉందా?.
కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ‘ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్’ను 2013 ఆగస్టు 21న ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా 82 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.కోర్టుకు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళవచ్చు?.
సమాచార హక్కు చట్టం సెక్షన్ 20(2) ప్రకారం క్రమక్షణ చర్యలకు సిపారసు, గడువులోగా సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల ఫోరమ్స్ / కోర్టులకు వెళ్ళవచ్చు. పౌర సమాచార అధికారి (పి.ఐ.ఒ) తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమీషనర్ కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా డైరెక్టుగా న్యాయస్థానానికి వెళ్ళవచ్చు. సమాచార కమీషన్లు సమాచారం ఇవ్వమని ఆదేశించినా సమాచారం ఇవ్వకుండా ఉంటే హైకోర్టు / సుప్రీం కోర్టులకు వెళ్ళవచ్చు.
స.హ.చట్టం క్రింద చేసిన దరఖాస్తును వెనుకకు తీసుకోమని బెదిరించిన, వేధించిన కలెక్టరు / ఎస్పీ గారికి పిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం కోరే వ్యక్తులకు బెదిరింపులు, వేధింపులు ఎదురైనప్పుడు వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం సమాచార హక్కు కార్యకర్తల పరిరక్షణ బిల్లు (విజిల్ బ్లోయర్స్)ను తీసుకువచ్చింది. దీన్ని రాష్ట్రపతి 2014 మే 9 వ తేదీన ఆమోదించగా, 2014 మే 12 వ తేదీన అమలులోకి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర పభుత్వాల పాలనకు పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఇది ఉద్దేశించింది. రెండు ప్రభుత్వాల పని తీరుకి చెందిన సమాచారం దేశ ప్రజలందరికి అందుబాటులో ఉంచడానికి ఇది కృషి చేస్తుంది. సమాచార హక్కు కార్యకర్తల గోప్యతను నిర్లక్ష్యంగా (లేదా) ఉద్దేశ పూర్వకంగా బయటపెట్టే అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష (లేదా) రూ.50,000 జరిమానా విధిస్తారు. ఇంకా వివరాలకు సంప్రదించండి. ఐడీ కార్డు తీసుకోండి . అవినీతిని అరికట్టడానికి, సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునేలా మార్గాలు తెలియ జేయ బడతాయి. - *ఫోరమ్ ఫర్ ఆర్టీఐ*. సమాచార హక్కు చట్టం, హ్యుమన్ రైట్స్ పై అవగాహన కల్పిస్తున్న సంస్థ. మీ కార్డు కోసం ఫోన్ చేయండి: 9014595182 కి కాల్ చేయండి. FRTI లో భాగస్వాములు కావాలి అని పిలుపు.