పవన్ కళ్యాణ్ కు పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ కు పెద్ద బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు
(జనచైతన్య న్యూస్) అమరావతి ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఏపీ సచివాయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చంద్రబాబు నాయుడు చేపట్టిన సమావేశం కొనసాగుతోంది, ఈ సందర్భంగా వచ్చే వందరోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు, కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏపీలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి, ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలి, దీనికి డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లో భారీఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం, అటవీ సంపద పెంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనమందరం వనభోజనానికి వెళ్దాం, ఫుడ్ హ్యాబిట్స్ మారుతుంటే ప్రోడెక్షన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి, 20లక్షల హెక్టారుల్లో 20లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం దిశగా ముందుకు వెళ్తున్నాం, హై ప్రోటీన్ ప్యాడీకి మార్కెట్లో డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వ్యవహరించాలి, ఎక్కడికక్కడ భూసార పరీక్షలు చేయాలి, ప్రతి రంగంలోనూ సాంకేతికతను ఉపయోగించుకోవాలి, గత ప్రభుత్వ విధానాల వల్ల ఫైబర్ నెట్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు, సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో క్లారిటీ లేదు అని చెప్పారు.