"స్పా" బ్యూటీ పార్లర్ లను పూర్తిగా నియంత్రించండి-సుజనా చౌదరి

"స్పా" బ్యూటీ పార్లర్ లను పూర్తిగా నియంత్రించండి-సుజనా చౌదరి

‘స్పా‘ షాపులు, సెంటర్లను  సెలూన్లను నియంత్రించండి

విజయవాడ-జన చైతన్య (రూషిత్  కుమార్)

నాయీ బ్రాహ్మణుల సంక్షేమం సుజనాతోనే సాధ్యం

సుజనాకు నాయీ బ్రాహ్మణుల సంఘం మద్దతు

స్పా సెంటర్ల పేరుతో తమ కడుపు కొట్టే వారిని  నియంత్రణ చేయాలని ఏపీ నాయీ  బ్రాహ్మణుల సంఘం విజ్ఞప్తి చేసింది.  నాయీ బ్రాహ్మణుల ఉపాధికి విఘాతం కలిగిస్తున్న సెలూన్లకు జీవో ద్వారా అడ్డుకట్ట చేయగలిగే సామర్థ్యం పశ్చిమ  బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కే ఉందనే నమ్మకం ఉందని, అందుకే తాము ఈ ఎన్నికల్లో సుజనాకు మద్దతును ప్రకటిస్తున్నామని నాయీ బ్రాహ్మణ సంఘం ఏపీ అధ్యక్షుడు రామారావు స్పష్టం చేశారు. స్పా సెంటర్లు వెలిసి తమ పొట్టను కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాయీ బ్రాహ్మణేతరులు  స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరపటంతో   తమకు చెడ్డ పేరు వస్తుందన్నారు. స్పా సెంటర్స్ లో సెలూన్ కి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలన్నారు. ఈ జీవో సాధన పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి ద్వారానే సాధ్యమవుతుందని తాము నమ్ముతున్నామని అందుకే సుజనాకు  మద్దతు ఇవ్వాలని తమ సంఘం తీర్మానించిందని రామారావు వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తమ ఓట్లు మొత్తం గంపగుత్తగా  సుజనాకు  వేయాలని నిర్ణయించుకున్నామని,  ఈ సందేశాన్ని తమ కులం వారందరికీ తెలియజేశామని చెప్పారు.. తమ వారికి అన్ని దేవాలయాల్లో బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించాలన్నారు. తమ కులంలో ఎంతోమంది ఆర్ఎంపీ వైద్యులుగా ఉండి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశాలలు నిర్వహిస్తున్నారని వారికి తక్కువ ధరకు ప్రభుత్వ గదులు కేటాయించాలని  కోరారు. తమ కులానికి సంబంధించిన వాయిద్య కళాకారులకు ఐడీ కార్డులు ఇవ్వాలని,  సంగీత పరికరాలను సబ్సిడీతో  అందించాలన్నారు.పశ్చిమ నియోజకవర్గం లోని మున్సిపల్ కాంప్లెక్స్ లోని షాపుల్లో నాయీ బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు.. పశ్చిమ నియోజకవర్గంలో తమ కులానికి కమ్యూనిటీ హాలు కట్టించాలనీ .ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా క్షవర శాలలు ఏర్పాటు చేయాలని కోరారు.నియోజకవర్గంలో తమకు పక్కా ఇళ్ళు నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో ఉప్పూడి రాము,   శ్రీను, పెద్దపూడి హేమంత్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ మాజీ  చైర్మన్ ఆర్. డి.. విల్సన్ సమన్వయం చేశారు.