రోడ్లపై నీళ్లు పోచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎంపీడీవోకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఎమ్మార్పీఎస్, సిపిఐ నాయకులు డిమాండ్

రోడ్లపై నీళ్లు పోచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎంపీడీవోకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఎమ్మార్పీఎస్, సిపిఐ నాయకులు డిమాండ్

రోడ్లపై నీళ్లు పోచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎంపీడీవోకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఎమ్మార్పీఎస్, సిపిఐ నాయకులు డిమాండ్ 

 జన చైతన్య న్యూస్- పెద్దపప్పూరు 

  అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ, పెద్దపుప్పూరు మండల సిపిఐ కార్యదర్శి చింతా పురుషోత్తం ఆధ్వర్యంలో పెద్దపప్పూరు మండల వ్యాప్తంగా నీళ్లు రోడ్లమీద పోసి రహదారిన పోయే వారికి ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ, సిపిఐ మండల కార్యదర్శి చింత పురుషోత్తం మాట్లాడుతు పెద్దపప్పూరు మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో ఇంటి ముందర కొళాయిలు ఏర్పాటు చేసుకొని, వృధానీళ్లు రోడ్ల మీదకి వదులుతున్నారని, రోడ్ల మీదికి నీళ్లు వదలకూడదు పడతారని చెప్పితే ఎదురు దాడి జరుపుతున్నారని, మండల ఎంపీడీవోకి విన్నవించారు.

పెద్దపప్పూరు, అమ్మలదిన్నె, కొత్తపల్లి, సోమనపల్లి, షేక్ పల్లి, నామనాంకపల్లి, చిక్కేపల్లి పలు గ్రామాలలో విడిచి అనవసరంగా గొడవలు సృష్టిస్తున్నారని గతంలో ఇంటి ముందర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసిన కూడా వృధానీళ్లు రోడ్ల మీద వదులుతున్నారని అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని, రోడ్ల మీదికి నీళ్లు వదలకుండా చేయాలని, ఎమ్మార్పీఎస్, సిపిఐ నాయకులు  డిమాండ్ చేశారు. మరి కొన్ని గ్రామాలలో అయితే పోలీసు వారికి తెలుసు, ఎమ్మార్వో వారికి తెలుసు, ఎంపీడీవో వారికి తెలుసు అని రోడ్లమీదకి నీళ్లు వదులుతున్నారని కొన్ని సందర్భాలలో ఘర్షణలు పడి పోలీస్ స్టేషన్లో కేసుల వరకు పోయినారని రోడ్ల మీదికి నీళ్లు వదలడం వల్ల రోజు నీళ్లు రోడ్లమీద పారి పాసిపట్టి కాళ్లు జారి కిందపడి కాళ్లు చేతులు విరిగిన సందర్భాలు ఉన్నాయని, నీళ్లలో బండి పోయేకి వీలు లేక మోటర్ బైక్ కూడా జారీ స్లిప్పయి బైక్ లో నుండి కిందపడి కాలు ఇరిగిందని, ఎంపీడీవో తో తెలపడం జరిగిందని, ఎమ్మార్పీఎస్ సిబిఐ నాయకులు తెలిపారు. వెంటనే స్పందించిన ఎంపీడీవో రోడ్లపైకి వృధా నీరు అనవసరంగా రోడ్ల మీదికి వదిలి రోడ్ల మీద వెళ్లే వారికి ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, సిపిఐ నాయకులు ఎంపీడీవోకు తెలియజేశారు.