ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ వి.గోపాలకృష్ణారావు
హైకోర్టు జస్టిస్ వి.గోపాలకృష్ణ రావు కి అమ్మవారి ఆశీర్వాదాలు
విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
శ్రీ అమ్మవారి ఆలయమునకు గౌరవనీయులైన రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ వి గోపాల కృష్ణా రావు కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి దర్శనార్థం విచ్చేయగా
ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.
అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈ ఈ శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేసినారు.