విజయవాడని అభివృద్ధి చేసి చూపిస్తాం. బిజెపి- సుజన చౌదరి

విజయవాడని అభివృద్ధి చేసి చూపిస్తాం. బిజెపి- సుజన చౌదరి

విజయవాడ ను అభివృద్ధి చేసి చూపిస్తాం

విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)

మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం విజయవాడ ఎంపీ అభ్యర్థి  కేశినేని శివనాథ్ , విజయవాడ పశ్చిమ బిజెపి అభ్యర్థి- వై.సుజనా చౌదరి. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలుగుదేశం విజయవాడ ఎంపీ అభ్యర్థి  కేశినేని శివనాథ్ (చిన్ని ), విజయవాడ పశ్చిమ బిజెపి అభ్యర్థి వై సుజనా చౌదరి చెప్పారు. ఆదివారం ఉదయం వన్ టౌన్ లో తెలుగుదేశం నాయకులు కొణిజేటి రమేష్ స్వగృహం వద్ద నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో చిన్ని , సుజనా చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురికి వేద పండితులు వేద మంత్రాల మధ్య ఆశీర్వాదం అందజేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  సుజనా చౌదరి మాట్లాడుతూ తనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలతో విజయవాడ భవానిపురం, బిజెపి సభలో నగరాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలుగుదేశం నాయకులు కొణిజేటి రమేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి అభ్యర్థుల విజయం ఖాయమని అన్నారు. తెలుగుదేశం వాణిజ్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రాజు సోలంకి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పిళ్ళా సుదర్శన్ రావు, అమరా గోపాలకృష్ణ,ఈది సాంబశివరావు, ఈది సూరిబాబు, బిజెపి నాయకులు అడ్డూరి శ్రీరామ్, పొట్టి శ్రీహరి, బోగవల్లి శ్రీధర్, బి శివకుమార్ పట్నాయక్, అవ్వారు బుల్లబ్బాయి , ఎన్ ప్రభు కుమార్ తదితరులు పాల్గొన్నారు.