పెద్దపప్పూరు లో అంతర్జాతీయ శ్రీ హింస దినం ఆర్డిటి ఆధ్వర్యంలో జరిగింది

పెద్దపప్పూరు లో అంతర్జాతీయ శ్రీ హింస దినం ఆర్డిటి ఆధ్వర్యంలో జరిగింది

పెద్దపప్పూరు లో అంతర్జాతీయ శ్రీ హింస దినం ఆర్డిటి ఆధ్వర్యంలో జరిగింది

 జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు 

 అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం ఆర్డిటి కాలనీలో ఆర్డిటి స్కూల్ నందు అంతర్జాతీయ శ్రీ హింస దినం ఆర్డిటి ఆధ్వర్యంలోజరిగినది. ఏరియా టీమ్ లీడర్ లలిత, అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ మాదిగ వారు మాట్లాడుతూ మహిళలు మగవారితో సమానంగా ఎదగాలని మహిళల పైన నిత్యం ఏదో ఒక చోట దాడులు, అత్యాచారాలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే చదివే మార్గం చదువుకుంటేనే మనకు జ్ఞానం వస్తుంది, ప్రశ్నించే తత్వం వస్తుంది. కనుక మన పిల్లలను ఆడ మగ అని తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా చూసుకొని చదివించాలని ప్రభుత్వం ద్వారా, సంస్థల ద్వారా మహిళలకు బాలికలకు వారి ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిల్లలను మధ్యలోనే బడి కి మానే పిచ్చి,పనులకు పంపియకుండా గ్రామాలలో ఇప్పటికీ కూడా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం, వరకట్న వేధింపులు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొని వచ్చినది, ఆ చట్టాలను ఉపయోగించుకొని బాలికల మీద వేధింపులు గురి చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలని గ్రామాలలో ఇప్పటికీ వరకట్నం వేధింపులు ఉన్నాయి, చిన్న వయసులను పెళ్లిళ్లు చేస్తే 1098 నెంబర్ కి ఫోన్ చేయాలని, వరకట్నం, గృహహింసలు చేస్తే, లైంగిక వేధింపులు చేస్తే 100 నెంబరు కు ఫోన్ చేయాలని ఆర్డిటి సంస్థ అండగా ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డిటి ఏరియా టీమ్ లీడర్ లలిత, అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్/ సోషల్ కమిటీ లీడర్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ, ఆర్ డి టి సి ఓ లు ఓబులేసు, ఆంజనేయులు, చంద్ర, శ్రీనివాసులు, పార్వతి,భాగ్య, తిరుపతమ్మ సి డి సి నెంబర్లు నీలావతి, లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణమ్మ, ఈరన్న, ప్రసాదు,రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.