నల్లచెరువు వైపునకు గల సిమెంట్ దిమ్మెపై గుర్తుతెలియని వ్యక్తి మృతి

నల్లచెరువు వైపునకు గల సిమెంట్ దిమ్మెపై గుర్తుతెలియని వ్యక్తి మృతి

నల్లచెరువు వైపునకు గల సిమెంట్ దిమ్మెపై గుర్తుతెలియని వ్యక్తి మృతి

 జనచైతన్య న్యూస్- కదిరి

 సత్యసాయి జిల్లా కదిరి పట్టణం లోని కదిరి రైల్వే స్టేషన్ నందు గల 1 వ ప్లాట్ ఫారం దాటిన తరువాత నల్లచెరువు వైపునకు గల సిమెంట్ దిమ్మె పై గుర్తుతెలియని ఒక వ్యక్తి చనిపోయి వున్నాడని కదిరి రైల్వే ఎస్ఐ రహీమ్ తెలిపారు. చనిపోయిన వ్యక్తి తెలుపు, నలుపు, పసుపు రంగులు మిలితమైన నిలువు, అడ్డు గీతలు గల ఫుల్ షర్ట్, సిమెంట్ రంగు ప్యాంటు మరియు పసుపు,నలుపు, మెరూన్ రంగుల గీతలు గల తువాలు మరియు కుడి చేతి మణికట్టు వద్ద ఎర్రదారం కట్టి వుండి, చామన చాయ రంగు కలిగి చెప్పులు ధరించి ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే కదిరి ఎస్సై రహీం కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ నెంబరు 9440627642.