బటన్ నొక్కినా ఖాతాలో పడని డబ్బులు.
బటన్ నొక్కినా ఖాతాలో పడని డబ్బులు.(పుట్లూరు జనచైతన్య న్యూస్) రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, మహిళలు, విద్యార్థులు రైతులకు ముఖ్యమంత్రి బటన్ నొక్కారు.ఇందులో భాగంగా పుట్లూరు బీజేపీ మండల అధ్యక్షుడు రాగేని రామాంజి యాదవ్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రాగేని రామాంజి యాదవ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజలు రోజులు తరబడి ఎదురు చూసిన అర్హులకు బటన్ నొక్కినా ఖాతాలో డబ్బులు జమ కాలేదని విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఆసరా, విద్యా దీవెన, ఇన్ పుట్ సబ్సిడీ డబ్బులు బటన్ నొక్కినా ఏ ఒక్కరికీ లబ్దిదారుల ఖాతాలలో డబ్బులు జమ కాలేదు. ఇదేమి అన్యాయమంటు ప్రజలు వాపోతున్నారన్నారు.ఇప్పటికైనా బటన్ నొక్కినా ఖాతాలో డబ్బులు జమ కాలేదని ఆ నిధులు జమ చేస్తే సంతోషకరమైన ఉంటుందని పుట్లూరు మండల అధ్యక్షుడు రాగేని రామాంజి యాదవ్ తెలిపారు.