అవన్ బ్యూటీ క్లినిక్ ప్రారంభోత్సవం భవానిపురం

అవన్ బ్యూటీ క్లినిక్ ప్రారంభోత్సవం భవానిపురం
జనచైతన్య న్యూస్- పశ్చిమ
విజయవాడ జిల్లా పశ్చిమ నియోజకవర్గం భవానిపురం లో అవన్ బ్యూటీ క్లినిక్ ప్రారంభోత్సవం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయమని,పదిమందికి ఉపాధి కల్పించాలని అవన్ బ్యూటీ క్లినిక్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు.ప్రతి పదివేల మందికి ఒక బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆదివారం భవానిపురంలోని హెచ్ బి కాలనీలో అవన్ బ్యూటీ క్లినిక్ ను పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.ఉపాధి కల్పనలో భాగంగా మరిన్ని బ్యూటీ క్లినిక్లను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.నిర్వాహకులు బబ్బురి భూపాల్,బబ్బురి శ్రీరామ్, పావని మాట్లాడుతూ అందాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి అతి తక్కువ ధరలో ట్రీట్మెంట్ అందించాలని లక్ష్యంతో,పదిమందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో క్లినిక్ ప్రారంభించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి కూడా ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.డాక్టర్ అనూష మాట్లాడుతూ అందానికి మెరుగులు దిద్దేందుకు అధునాతన పరికరాలతో అన్ని రకాల సౌకర్యాలు తమ బ్యూటీ క్లినిక్ లో ఉన్నాయని తెలిపారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి బ్యూటీ క్లినిక్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.