ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు
ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు
జనచైతన్య న్యూస్- కదిరి
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు మాట్లాడుతూ, గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఐదేళ్ళ పాలనలో విచ్చలవిడిగా భూకబ్జాలకు పలుపడ్డారని సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామ్మన్నారు. రాష్టంలో 1.75 లక్షల భూములను ఆక్రమించి 36 వేల కోట్లు దొ్చేశారు, సహజ వనరులు దోపిడీ, ఐదేళ్ళ పాటు విచ్చలవిడిగా భూకబ్జలకు పాల్పడారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, మతాన్నీ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే సహించం, పేదరికం లేని సమాజమే తమ లక్ష్యం అని అన్నారు.