మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జనచైతన్య న్యూస్-యాడికి
అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మొదటగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కోన రోడ్డు లోని వివేకానంద హై స్కూల్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.వివేకానంద హై స్కూల్ టీచర్లు,విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవం గురించి చక్కగా వివరించడం జరిగింది.స్వాతంత్రం సాధించడానికి ప్రముఖులు చేసిన పోరాటాల గురించి వివరించడం జరిగింది,టెంకాయల నాగ రంగయ్య దేశభక్తి గీతాలు ఆలపించారు,ఈ కార్యక్రమంలో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు బాలకృష్ణ బండారు,చందగాని ధ్రువ నారాయణ,చింత నరసింహ,ఉడుముల వెంకటరాముడు,గంగవరం పవన్,మెటికల చెన్నయ్య,కరెంటు జన, టెంకాయల నాగ రంగయ్య,గాంధీజీ స్కూల్ రామ మోహన్ తదితరులు పాల్గొన్నారు.