జర్నలిస్టుల పిల్లల ఉచితవిద్య కోసం దరఖాస్తు చేసుకోండి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్

 జనచైతన్య న్యూస్- అనంతపురం

 అనంతపురం జిల్లా లో 2024 వ సంవత్సరం అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలందరికీ ప్రవేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి ప్రభుత్వాధికారులు జర్నలిస్టుల పిల్లల వివరాలు అడిగారని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజేే  జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ పేర్కొన్నారు. జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.. జిల్లాలో అక్రిడేషన్ పొందిన జర్నలిస్టులు తమ అక్రిడేషన్ జిరాక్స్ తో పాటు విద్యార్థి ఆధార్ కార్డు, స్కూల్ పేరు తదితర వివరాలతో ఏపీయూడబ్ల్యూజే నాయకులను కలిసి దరఖాస్తులు అందజేయాలని కోరారు. ఈనెల 15వ తేదీలోగా జర్నలిస్టుల పిల్లల వివరాలు స్థానికంగా ఉన్న యూనియన్ నాయకులకు అందజేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ అప్లికేషన్లు నియోజకవర్గాల వారిగా ఏపీయూడబ్ల్యూజే నాయకులుకు అందజేయలన్నారు.