78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి
78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి
జనచైతన్య న్యూస్- రాయచోటి
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో స్వాతంత్ర్యపు సమరయోధుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరమూ నడచి దేశాభివృద్ధికి కృషి చేద్దామని వైఎస్ ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వీరుల ప్రాణ త్యాగాలతో నిర్మించబడిన మన భారత దేశం మహోజ్వలంగా ఎదగాలని ఆకాంక్షించారు,అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి లో వరుసగా మూడవ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుచుండడం హర్షదాయకమన్నారు.రాయచోటి పట్టణంలో తక్కువ కాలంలోనే పోలీసు పరేడ్ గ్రౌండ్,తదితర అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకుని,స్వాతంత్ర్య వేడుకలు చక్కగా నిర్వహించాలన్న తన కల కొనసాగుతుండడం చాలా సంతోషదాయకమన్నారు,స్వాతంత్ర్య ఫలాలు అందరికీ దక్కి,సామాజిక పరంగానూ,విద్యాపరంగాను అభివృద్ధి చెందాలన్నారు.స్థానిక ప్రజా ప్రతినిధులకే జెండా ఆవిష్కరణ చేసే అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు.గ్రామ గ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుచుండడం మంచి పరిణామమన్నారు,నియోజక వర్గ ప్రజలకు 78 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల ను శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.