వైసిపి ప్రభుత్వంలో ఇచ్చేది గోరంత- దోచేది కొండంత దళిత బలహీన వర్గాలు

వైసిపి ప్రభుత్వంలో ఇచ్చేది గోరంత- దోచేది కొండంత దళిత బలహీన వర్గాలు

దళితులను వేధిస్తున్న వైసీపీని భూస్థాపితం చేయండి

విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)

ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెన్నకేశవులు పిలుపు  విజయవాడ                  దళితుల పట్ల చిన్నచూపు చేస్తూ గత ఐదేళ్లలో 28 మంది దళిత బిడ్డలను హత్య చేయించిన వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాలని రాష్ట్ర ప్రజలకు ప్రబుద్ద రిపబ్లికన్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల సీఎం జగన్ అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఇచ్చేది గోరంత దోచేది కొండంత విమర్శించారు. జగన్ పాలనలో 28మంది దళిత బిడ్డలు హత్యకు గురయ్యారని అన్నారు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ ఆనంతబాబును అందలం ఎక్కించడమే కాకుండా అతని భార్యకు రంపచోడవరం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జగన్ మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు . దళితులకు శిరోమండలం కేసులో శిక్ష పడ్డ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జగన్ ప్రోత్సహించడం దారుణమని విమర్శించారు.అలాగే 72 వేల కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దోచుకున్న జగన్ దళితులకు ద్రోహం చేస్తున్నారని దళితులకు అన్యాయమే జరుగుతుంది. వారిపట్ల పాసావికమైన ఆలోచన విధానాలను అనేక రూపాల్లో  వ్యవహరించారు.వారిని అట్టడుగు స్థాయికి దిగజారుస్తున్న వివక్ష  జగన్ ఓటమి తథ్యం విమర్శించారు. ఎన్నికల్లో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు, బహుజన ప్రజా సంఘాలకు, ప్రజాస్వామిక వాదులకు నాయకులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు సమావేశంలో మాట్లాడారు .ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి గుర్రం రామారావు, విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల, జయ బాబు ,ధనలక్ష్మి, కే .సాయి కుమారి, పి, ఆంజనేయులు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ కోఆర్డినేటర్ పి. రాజారావు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎల్. శంకర్, నల్లపు జాలరావు ,పి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.