జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా,పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు

 జనచైతన్య న్యూస్-కదిరి

  సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కదిరి జన సేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో నవ నరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రాలలో ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కి ఆశీస్సులు కలగాలని ఆలయాలంలో స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.ఈ సందర్భంగా భైరవ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జన సేన పార్టీలు ఉమ్మడిగా ఈ నియంత పాలనకు స్వస్తి పలుకుతూ జే ఎస్ పి , టిడిపి, బిజెపి కూటమి అభ్యర్థులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పట్టం కడుతూ 164 స్థానాల్లో గెలుపును అందించారు.వీరి నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు,భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రిగా పవన్ కళ్యాణ్ ,కదిరి నియోజక వర్గం ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు, కదిరి పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ కుటాల,ఐటి వింగ్ కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శులు వానిల్లి అంజిబాబు , గుంతా ప్రతాప్ , కార్యదర్శులు ఈటి లోకేష్ , నంది శెట్టి బాబు,అక్బర్, రాజ , అరవింద్ , రఘు , వంశి, మధు, అంజి,అశోక్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.