మాజీ మంత్రి పల్లె ఆధ్వర్యంలో 15 కుటుంబాలువైసీపీని వీడి టిడిపిలోకి

మాజీ మంత్రి పల్లె ఆధ్వర్యంలో 15 కుటుంబాలువైసీపీని వీడి టిడిపిలోకి

మాజీ మంత్రి పల్లె ఆధ్వర్యంలో 15 కుటుంబాలువైసీపీని వీడి టిడిపిలోకి

పుట్టపర్తి నియోజకవర్గం : ఓడిసి మండలం ఎద్దుల వారి పల్లి కి చెందిన 15 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు, పల్లె రఘునాథ్ రెడ్డి గారి సేవాగుణం మెచ్చి వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు  తెలియజేశారు. సుధాకర్ నాయక్, భీమా నాయక్, గంగరాజు సుధాకర్ నాయక్, దశరథ్ నాయక్, ప్రసాద్ నాయక్, రాజు నాయక్, వెంకటేష్ నాయక్, జే.సునంద తో పాటు మరికొందరికి మాజీ మంత్రి పల్లె టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా యువత, మహిళలు పెద్ద ఎత్తున కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం చంద్రబాబునాయుడు గారితోనే సాధ్యమని, కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలసి కష్టపడి పని చేయాలని, కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తగిన ప్రాధాన్యం తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా పల్లె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.