జనసేన ఆద్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

జనసేన ఆద్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

జనసేన ఆద్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

 జనచైతన్య న్యూస్- కదిరి

సత్యసాయి జిల్లా కదిరి అర్బన్ మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా కదిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఇంచార్జీ భైరవ ప్రసాదు ఆద్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.కేక్ కోసీ అందరికి పంచిపెట్టారు, ఈ సందర్భంగా మాట్లడుతూ యెటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి, గత నాలుగు దశాబ్దాలుగా తన కష్టంతో నెంబరు వన్ స్థానంలో కొనసాగుతున్నారని, అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా తన అభిమానులను పాలుపంచుకునే లాగా చేసిన ఘనత ఒక్క చిరంజీవికీ తప్ప ఎవరికీ దక్కదని, అలాగే ఎంతో మంది ఆయన్ని వ్యక్తిగత విమర్శలు చేసిన తిరిగి వారిని యేమి అనని మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి చిరంజీవి, అలాగే కేంద్ర మంత్రి గా అంధ్రప్రదేశ్, తెలంగాణ అభివృద్ధి కీ పాటుపడిన వ్యక్తి అని, అలాగే ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు చలపతి, నల్లచెరువు మండల కన్వీనర్ రవికుమార్, న్యాయవాది రవీంద్రా, నాయకులు కిన్నెర మహేష్, సోమశేఖర్, లోకేష్, రాజేంద్ర ప్రసాద్, రాజారాం, రామ్మోహన్, సూర్యనారాయణ, ప్రతాప్, నాగరాజు, గంగరాజు, వంశీ, రామనప్ప, రాజా, దినేష్ తదితరులు పాల్గొన్నారు.